–నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి
DSP Sivaram Reddy: ప్రజాదీవెన నల్లగొండ టౌన్ : యువత గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక డిఎస్పి కార్యాలయం లో భగత్ సింగ్ వర్ధంతి సందర్బంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రూపొందించిన “సే నో టు డ్రగ్స్” పోస్టర్ల ఆవిష్కరణ చేశారు. జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవర్ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి బారిన యువత పడకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ గురించి సమాచారని 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలన్నారు. యువతను చైతన్యం చేస్తున్న ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులను అభినందించారు.
ఈ సందర్బంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్సులు మల్లం మహేష్, ఖమ్మంపాటి శంకర్ లు మాట్లాడుతూ దేశ స్వాతత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతి సందర్బంగా బైక్ ర్యాలీ, రక్త దాన శిబిరాలు, శ్రమాదానాలు, మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తు యువత చెడు మార్గం పట్టకుండా మంచి మార్గం వెళ్లే విందగా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, డివైఎఫ్ఐ జిల్లా ఉపధ్యక్షులు గుండాల నరేష్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు పాలది కార్తీక్,మారపాక కిరణ్, స్పందన, సిరి, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.