Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DSP Sridhar Reddy : కోదాడలో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయం.డిఎస్పి శ్రీధర్ రెడ్డి.

DSP Sridhar Reddy : ప్రజా దీవేన ,కోదాడ: పట్టణంలో మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి క్రీడా సాహిత్య సంస్కృతిక వేడుకలు నిర్వహించడం అభినందనీయమని కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా నుంచి రాష్ట్రస్థాయి క్రీడల్లో గెలుపొందిన విజేతలకు, పీఈటీలకు,కార్యక్రమ నిర్వహణ కన్వీనర్ల ను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ప్రభుత్వానికి ఎంతో కాలం సేవలందించి పదవి విరమణ అనంతరం విశ్రాంతి తీసుకోకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు.

 

అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ళ సీతారామయ్య మాట్లాడుతూ కోదాడ పెన్షనర్ల సంఘం అనేక కార్యక్రమాలను చేపడుతూ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని కోదాడ సంఘం చేపడుతున్న కార్యక్రమాలను చూసి రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్లు అనుసరిస్తున్నారని తెలిపారు. పదవి విరమణ అనంతరం విశ్రాంతి తీసుకోకుండా పెన్షనర్లు సంఘంలో చేరి సామాజిక సేవా కార్యక్రమల్లో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీధర్ రెడ్డిని శాలువా మెమెంటో తో ఘనంగా సన్మానించారు. అనంతరం మార్చి నెలలో జరుపుకునే పెన్షనర్ల జన్మదిన వేడుకలను సామూహికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య కార్యదర్శి సుబ్బయ్య రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని రంగారావు, జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, సెక్రటరీ బొల్లు రాంబాబు, సోమయ్య, రఘు వరప్రసాద్, బచ్చలకూరి జార్జ్ శోభ , భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు.