Earthquake: ప్రజా దీవెన, న్యూఢిల్లి: నేపాల్ సరిహద్దుల్లో టిబెట్ సమీపంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించిన ఘటనలో ఇప్పటి వరకు 95 మంది మరణించారని అధికారిక గణంకాలు వెల్లడిస్తు న్నాయి. అదే సందర్భంలో భార తదేశంలో కూడా పలు ప్రాంతాలు బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్ లో సైతం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు చైనా మీడియా సంస్థ వెల్లడించింది. టిబె ట్ రాజధాని లాసాకు దాదాపు 40 0 కిలోమీటర్ల దూరంలోని షిగాట్సే నగరంలోని టింగ్రి కౌంటీ వద్ద భూ కంప కేంద్రాన్ని గుర్తించినట్లు వివ రించింది.మంగళవారం ఉదయం ఈ ప్రాంతంలో వరుసగా పలుమార్లు భూకంపం సంభవించిందని తెలిపింది. తొలుత ఉదయం 6.35కు ఆ తర్వాత 7.02 గంట లకు 10 కిలోమీటర్లు లోతుగా 4.7 తీవ్రతతో భూకంపం సంభవించిం దని పేర్కొంది.
ఆ కొద్ది సెకన్లకే అంటే7.07 గంటలకు 30 కిలోమీ టర్ల లోతులో మళ్లీ భూమి మరిం తగా కంపించిందని ఇది 4.9 తీవ్ర తతో వచ్చిందని చైనా మీడియా పేర్కొంది.హిమాలయ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవి స్తోంటాయని గుర్తు చేసింది. అయి తే 2015లో నేపాల్‌లో 7.8 తీవ్ర తతో భూకంపం ఏర్పడిందని గుర్తు చేసింది. ఈ ఘటనలో దాదాపు 9 వేల మంది మరణించారని వివరిం చింది. అలాగే 22 వేల మంది గా యపడ్డారని చెప్పింది. అయితే ఈ భూకంప తీవ్రతకు లక్షలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయని గుర్తు చేసింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
