–ప్రతి విద్యార్థి ప్రాధమిక స్థాయి లోనే మాతృభాష పై పట్టు సాధించాలి….
–ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులు సత్ ప్రవర్తన కల్గి ఉండాలి…
–ఉపాధ్యాయ వృత్తి గౌరవ ప్రదమైనది….
District Collector Tejas Nand Lal Pawar : ప్రజాదీవెన, సూర్యాపేట :విద్యా ద్వారానే సమాజం మార్పు చెంది పేదరికం తొలిగిపోయి దేశం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో సూర్యాపేట డివిజన్ నియోజకవర్గం పరిధిలోని సూర్యాపేట, ఆత్మకూరు (ఎస్ ), పెన్ పహాడ్, చివ్వేంల, మోతే మండలాలకి చెందిన ఎం ఈ ఓ, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో, ఉపాధ్యాయులతో ఫౌండేషన్ లీటరసీ న్యూమరసీ (ఎఫ్ ఎల్ యన్ ) పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువు భోదిస్తామని విద్యార్థుల్లో నమ్మకం కల్గించి వచ్చే విద్యా సంవత్సరంకి ఎక్కువ మంది విద్యార్థులు నమోదు అయ్యేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
ప్రతి రోజు విద్యార్థులకి తెలుగు రాయటం, చదవటం నేర్పించెందుకు ఉపాధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించాలని సూచించారు.మొదటగా సులభమైన పదాలు నేర్పి తదుపరి కఠినమైన పదాలు నేర్పాలని అర్ధం కానీ విద్యార్థులకి వీడియోల ద్వారా తెలుగు, హిందీ భాషలు నేర్పించాలని తెలిపారు.విద్యార్థుల తల్లిదండ్రులు మా పిల్లలకి మంచి చదువు చేప్పించాలని ఆలోచిస్తున్నారని వారికి ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కల్గించేలా బడిబాట కార్యక్రమం లో తెలియపర్చి విద్యార్థులు ఎక్కువ నమోదు అయ్యేలా చూడాలని తెలిపారు.
ఉపాధ్యాయులు భాద్యతగా ఉంటూ గత సంవత్సరం లో జరిగిన వైఫల్యాలు సరిచేసి వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రాధమిక పాఠశాలలోనే తెలుగు భాష రాయటం, చదవటం అలాగే ఇంగ్లీష్, మ్యాథ్స్ లో కనీస సామర్థ్యాలు, అలాగే జడ్పి ఉన్నత పాఠశాలలో ఎల్ టి ఐ మొదటి 60 రోజులలో నేర్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.ప్రాధమిక స్థాయి లోనే ప్రతి విద్యార్థిkకి మాతృభాష పై పట్టు సాధించేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని తెలిపారు. ప్రతి రోజు విద్యార్థి తెలుగులో 4 పేజీలు చదివించాలి, 2 పేజీలు రాపించాలి తదుపరి డికటేషన్ ద్వారా తెలుగుసబ్జెక్ట్ పై పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు.
విద్యార్థులకి నేర్పించే పద్ధతులు మారినాయి కానీ ఫలితాలు రావటం లేదని ఇక నుండి మండల స్థాయి లో, జిల్లా స్థాయి లో ఎఫ్ ఎల్ ఎన్ పై సమీక్షలు నిర్వహిస్తామని ప్రతి పరీక్షకి విద్యార్థుల చదువులో పురోగతి ఉండాలని తెలిపారు.ఇక నుండి ప్రతి సంవత్సరం మంచి గా చదివిన విద్యార్థులకి, మంచి ప్రదర్శన చూపెట్టిన ఉపాధ్యాయులకి మండల స్థాయి లో ఒక బహుమతి, జిల్లా స్థాయి లో 3 బహుమతులు అందజేస్తామని తెలిపారు.
ప్రతి వారం వీక్లీ సెల్ఫ్ అసెస్ మెంట్ లో వెనకబడిన విద్యార్థులు ఎలా మెరుగుపర్చాలో అలోచించి మంచి సంకల్పంతో పని చేసి ఆలోచనలను ఆచరించేలా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ఎఫ్ ఎల్ ఎన్ పై 60 రోజుల కార్యాచరణ లో భాగంగా బృందాలు ఏర్పాటు చేసి పేపర్లు తయారు చేసి ఆగస్టు 15 లోపు అందరికి కనీస సామర్థ్యాలు నేర్పించి జిల్లాలో తెలుగు రాయటం, చదవటం రాని వారు ఉండవద్దు అని, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద పెట్టి డిజిటల్ క్లాస్ లు నిర్వహించి అర్ధం అయ్యేలా భోదించాలని తెలిపారు.మంచి ప్రదర్శన చూపెట్టిన విద్యార్థులకి పెన్నులు, పుస్తకాలు ఇచ్చి అభినందించాలని అన్నారు.విద్యార్థుల పట్ల టీచర్లు స్నేహ పూర్వకంగా ఉంటూ కనీస సామర్థ్యాలు నేర్పాలని ఎం ఈ ఓ లు,కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు విద్యార్థులవారీగా, పాఠశాల వారీగా పరిశీలించాలని తెలిపారు.
ఇప్పటి నుండి ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా అందరు ప్రతి విద్యార్థివి అసెస్ మెంట్ రిపోర్ట్, వార్షిక పరీక్షల రిపోర్ట్, విద్యార్థుల పని తీరు, తెలుగు ఇంగ్లీష్, గణితంలో కనీస సామర్థ్యాలు, ఎఫ్ ఎల్ ఎన్ అలాగే వార్షిక పరీక్షలు పై రిమార్కులు,విద్యా సంవత్సరం లో విద్యార్థులు ఉపాధ్యాయులు చేపట్టిన మంచి కార్యాచరణ, వెనకబడిన విద్యార్థుల జాబితా రూపొందించి వారిని ఎలా మెరుగుపర్చాలనే ప్రణాళికలు సిద్ధం చేసి హెడ్ మాస్టర్ కి అప్పగిస్తే హెడ్ మాస్టర్ పాఠశాల మొత్తం నివేదిక మండల విద్యాధికారికి సమర్పించాలని తెలిపారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకి మంచి ప్రవర్తన కలిగి ఉండేలా, ప్రతి ఒక్కరి పట్ల క్రమశిక్షణ కలిగి ఉండేలా చూడాలని అన్నారు. కలెక్టర్ లు, డాక్టర్లు, రాజకీయాలలో ఉన్నత స్థానానికి చేరాలి అంటే విద్యనే ప్రధమ ఆయుధం కాబట్టి ఉపాధ్యాయ వృత్తి సమాజం లో గౌరవ ప్రదమైనదని అలాగే విద్యార్థులు వారి భవిష్యత్ కోసం కష్టపడే ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ఉండాలి అని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో డిఈఓ ఆశోక్, క్వాలిటీ కో ఆర్డినేటర్ జనార్దన్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్, ఇంక్లూజివ్ కో ఆర్డినేటర్ రాంబాబు, జనరల్ ఈక్వలిటీ కో ఆర్డినేటర్ పూలమ్మ, ఎం ఈ ఓ లు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.