Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Phule Vigyan Bhavan: హైదరాబాదులో పూలే విజ్ఞాన్ భవన్ ఏర్పాటుకు కృషి 

–బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కృ త నిశ్చయంతో కట్టుబడ్డాo

–కామారెడ్డి డిక్లరేషన్ అమలుకు ప్ర భుత్వం చిత్తశుద్దితో పనిచేస్తాం

–బీసీ సంఘాల భేటీలో ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Phule Vigyan Bhavan : ప్రజా దీవెన, హైదరాబాద్: గత సా ధారణ ఎన్నికలకు ముందు కామా రెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చి న డిక్లరేషన్ రాష్ట్ర ప్రభుత్వం కట్టు బడి ఉందని బీసీ రిజర్వేషన్లు పెం చడంతోపాటు రాష్ట్ర బడ్జెట్ లో ని ధులు పెంచి బీసీ సబ్ ప్లాన్ తీసు కువచ్చే దిశగా ఆలోచిస్తున్నామని, బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టు బడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

 

గురువారం హైదరాబాదులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య క్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృ త్వంలోని బీసీ ప్రతినిధుల బృందం మాత్మ జ్యోతిబాపూలే భవన్ లో రా ష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమా ర్కతో భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా బీసీ డిమాండ్లపై సుదీర్ఘంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ తో బట్టి విక్ర మార్క చర్చించారు.

 

మొదటగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షే మానికి ప్రతి ఆర్థిక సంవత్సరం 20 000 కోట్లు కేటాయించాలని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోని బీసీలకు కూడా చట్టబద్ధమైన సబ్ ప్లాన్ తీ సుకురావాలని, గత నాలుగు సంవ త్సరాలుగా ఉన్న బీసీ విద్యార్థుల ఫీజుల బకాయిలను తక్షణమే చె ల్లించాలని హైదరాబాదులో ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కునే విధంగా మహాత్మ జ్యోతిబాపూలే నాలెడ్జ్ సెం టర్ ను ఏర్పాటు చేయాలని, పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ల సంఖ్యను పెం చాలని, ప్రభుత్వ కాంట్రాక్టులలో బీ సీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉ ప ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు.

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మా ట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్ర కారం బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచడంతోపాటు బీసీలకు నిధుల కేటాయింపులలో కూడాఅన్యాయం జరగకుండా చూస్తామని, బీసీ సప్లై కూడా సరైనటువంటి సమయంలో తీసుకు వస్తామని, హైదరాబాదులో మాత్మ జ్యోతిబాపూలే నాలెడ్జ్ సెం టర్ ఏర్పాటుకు సానుకూలంగా ఉ న్నామని ఆయన అన్నారు. బీసీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కమి టీ మెంట్ తో పనిచేస్తుందని ఇందు లో ఎవరికి ఎలాంటి సందేహాలను లేవని, బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్ర భుత్వం ఆర్నిశలు పనిచేస్తుందని ఆ యన తెలిపారు ఫీజుల రియంబ ర్స్మెంట్ బకాయిలు దశలవారీగా చెల్లిస్తామని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం జాగ్రత్త లను తీసుకుంటుందని బట్టి విక్ర మార్క హామీ ఇచ్చారు.

 

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసిన వారిలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చా రి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కా ర్యనిర్వక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీని వాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సం ఘం జాతీయ అధ్యక్షులు తాటి కొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకా ల శ్యాంకూర్మ, బీసీ మహిళా సం ఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి డి రమ, బి సి మేధావుల వేదిక నాయకులు ప్రొ ఫెసర్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ శ్రీని వాస్, బీసీ నేతలు రావులకు నరేష్ ప్రజాపతి, జాజుల లింగం గౌడ్, వే ముల నాదం గౌడ్, పానుగంటి విజ య్, జి నాగరాజు గౌడ్, సత్యం గౌ డ్, ఇంద్రమ్ రజక, గౌతమ్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.