Praja Deveena
Newspaper Banner
Date of Publish : 23 January 2026, 3:37 pm Posted by : praja deveena

District Collector Badugu Chandrashekhar : చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు పగ డ్బందీ ఏర్పాట్లు 

— నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

District Collector Badugu Chandrashekhar : ప్రజా దీవెన, నార్కట్ పల్లి: చెరు వుగట్టు బ్రహ్మోత్సవాల సంద ర్భం గా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు స మ న్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ చెప్పారు. శుక్రవారం ఆయన నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టులో జి ల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో క లిసి చెరువు గట్టు బ్రహ్మోత్సవాల సం దర్భంగా ఏర్పాట్లును పర్యవేక్షిం చారు.

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల సంద ర్భంగా భారీగా భక్తులు తరలి వస్తు న్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ ని యంత్రణ, పారిశుద్ధ్యం, త్రాగునీ రు, విద్యుత్ సరఫరా వంటి కీలక ఏర్పాట్లు నిరంతరం పర్యవేక్షిస్తు న్నామని తెలిపారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం క ల గకుండా క్యూలైన్ల నిర్వహణ, తా త్కాలిక షెడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్ సదుపాయాలు ఏర్పా టు చేశామని పేర్కొన్నారు. అగ్ని మాపక, పోలీస్, రెవెన్యూ, మున్సి పల్, ఆరోగ్య శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉం డాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అన్నా రు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, నిరంతర శుభ్రత చర్యలు చేపట్టాలని, త్రాగునీరు సరిపడా ఉండేలా ట్యాంకర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

విద్యుత్ అంతరాయం లేకుండా బ్యాకప్ ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ట్రాఫిక్ జామ్‌లు నివారించేందుకు పార్కింగ్ ప్రాంతాలు, రూట్ మ్యా పింగ్‌ను ముందుగానే సిద్ధం చేసిన ట్లు చెప్పారు.బ్రహ్మోత్సవాలు భక్తు లందరికీ సుఖశాంతులతో సాగాల న్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలు కూడా అధికారులకు సహకరించా లని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఉత్సవాలు ముగిసే వరకు ఏర్పా ట్లను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ అవస రమైనచోట తక్షణ చర్యలు తీసు కుంటామని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, రె వి న్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీని వా స్, డి.ఎస్.పి శివరాం రె డ్డి ,ఆ ల య ఈవో మోహన్ బాబు, ఇతర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నా రు.