Election schedule : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు (Jharkhand, Maharashtra Assembly Elections) నగారా మోగనుంది. భారత ఎన్నికల కమిషన్ (Election Commission of India) మంగళవారం మధ్యాహ్నం 3:30 నిముషాలకు ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ (media conference) ద్వారా ఈ విషయాన్ని వెల్లడించనుంది. దీనికి సంబంధించిన ఈసీ అధి కారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ మీడియా సమావేశం జరగనుంది. కాగా అనధికారిక సమాచారం ప్రకారం ఈ రెండు రాష్ట్రాలకు నవంబర్‌లో ఓటింగ్ జరిగే అవకా శాలున్నట్లు తెలుస్తోంది. అయితే దీపావలితో పాటు ఝార్ఖండ్‌లో ప్రధాన పండగైన ఛఠ్ పూజ, దేవి దీపావళి పండుగలు కూడా వరు సగా ఉండడంతో ఇవి ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే నవంబర్ రెండో వారంలో లేదా మూడో వారంలో ఓటింగ్ నిర్వహించే అవకాశాలు కనిపి స్తున్నాయి.
మధ్యంతర ఎన్నికలకూ నోటి ఫికేషన్ (Notification).. .ఇదిలా ఉంటే మహారా ష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా మరో 45 ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాలకు కూడా మధ్యంతర ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి కూడా ఈ సమా వేశంలోనే నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నియోజక వర్గాల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi)రాజీనామా చేసిన వాయనాడ్ పార్లమెంట్ స్థా నంతో పాటు బెంగాల్ టీఎంసీ నేత షేక్ నూరుల్ ఇస్లామ్ మరణంతో ఖాళీ అయిన బషీర్‌హాట్ ఎంపీ స్థానాలున్నాయి.