Electric Shock: ప్రజా దీవెన, చెన్నై: తమిళనాడు లో విషాద సంఘటన చోటుచేసు కుంది. విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యా రు.అందరూ చూస్తుండగానే కరెం ట్ షాక్ తో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద ఘటన కన్యాకుమారి జిల్లాలో రాత్రి చోటుచేసుకుంది.కన్యాకుమారి జిల్లాలో చర్చ్ ఉత్స వాల సందర్భంగా చేస్తున్న ఎర్పాట్ల సమయంలో ప్రమాదం చోటుచేసు కుంది. బుద్దంతురై ఏరియా ఉత్స వాల్లో నిచ్చెనను తీసుకెళ్తుండగా హైవోల్టేజీ వైర్లకు తగలడంతో యు వకులు విద్యుత్ షాక్ కు గురయ్యా రు.
కరెంట్ షాక్ కొట్టడం అక్కడిక క్కడే నలుగురు యువకులు ప్రాణా లు కోల్పోయారు.వారి ప్రాణాలను కాపాడడానికి స్థానికులు కర్రలతో ప్రయత్నించినప్పటికీ ఫలితం లే కుండా పోయింది. చేతికి అంది వచ్చిన కుమారులు మృత్యువాత పడడంతో తల్లిదండ్రుల రోధన అరణ్య రోదనగా మిగిలింది. మృ తుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఘటనపై కేసు నమో దు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Electricity accident in Chennai pic.twitter.com/pyrt0SMSJo
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) March 2, 2025