–విద్యుత్ సంస్థలపై విపరీత బరు వు పడిందంటున్న ప్రభుత్వం
–విద్యుత్తు కారిడార్ బుకింగ్‌తో అదనపు నష్టం, ఆపై రద్దు చేసు కున్నందుకూ పరిహారం
–విద్యుత్తు ఒప్పందo ఆమోదానికి ఈఆర్సీ
Electricity:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ (TELAGANA ELECTRICITY)సంస్థలు విపరీ తమైన వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలు విద్యుత్ సంస్థల కొనుగోలులో జరిగిన అక్రమాలు అవినీతిపైన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జరిగిన అక్రమాలపరంగా రాష్ట్ర ఖజానాపై ఆరు వేల కోట్ల ఆర్థిక భారం పడిందని ప్రభుత్వ వర్గాలే ప్రకటించడం సరికొత్త వివాదానికి దారి తీసింది. గత బిఆర్‌ఎస్ (brs) ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు (ELECTRICITY)కొనుగోలు చేయ డం ద్వారా తెలంగాణ విద్యుత్తు సంస్థలపై మోయలేని భారo పడిం దని పేర్కొంటున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న సంబంధాన్ని నిర్ణయాల వల్ల దాదాపు 6వేల కోట్ల భారం పడిందని ప్రస్తుత పాలక ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తుండడం తో రాజకీయం రచ్చ రచ్చ గాను ఉందని ఆయా వర్గాలు భావిస్తు న్నాయి. ఒప్పందం ప్రకారం యూని ట్ ధర రూ.3.90 మాత్రమేనని చెబుతున్నప్పటికీ, ఛత్తీస్‌గఢ్ నుం చి విద్యుత్తు తెలంగాణకు సరఫరా అయ్యేటప్పటికి అయిన ఖర్చుతో కలిపి ఆ ధర భారీగా పెరిగిపో యిందని ఆరోపణలు వినవస్తు న్నాయి.
ఆ రాష్ట్రం నుంచి తెలం గాణ (TELAGANA) ఇప్పటివరకు 17,996 మిలి యన్ యూనిట్ల విద్యుత్తును కొను గోలు చేసిందని, ఇందుకోసం రూ. 7,719 కోట్లు చెల్లించిందని, అయి తే ఇంకా చెల్లించాల్సిన బకాయిలు రూ.1,081 కోట్లు ఉన్నాయని,ఈ క్రమంలోనే ట్రాన్స్‌మిషన్, లైన్ చార్జీ లు రూ.1,362 కోట్లు కాగా అధికా రిక గణాంకాల ప్రకారం ఒక్కో యూ నిట్‌కు ఖర్చు రూ.5.64 వరకు అవు తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతు న్నాయి. విద్యుత్తు (ELECTRICITY) కొనుగోలు చేసిన ధర కంటే చార్జీల రూపంలోనే రూ. 3,110 కోట్ల అదనపు భారం పడి నట్లయిందని గుర్తు చేస్తున్నాయి. ఇదిలా ఉండగాబకాయిల విష యంలోనూ రెండురాష్ట్రాల మధ్య వివాదం ఇంకా తేలలేదు. రూ.10 81 కోట్ల బకాయిలున్నట్లు తెలం గాణ చెబుతుండగా ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు సంస్థలు మాత్రం రూ.17 15 కోట్ల బకాయిలున్నట్లు లెక్క చూపుతున్నాయి. ఈ బకాయిల వివాదంపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు కూడా చేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తును తెచ్చుకునేం దుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) తో వెయ్యి మెగావాట్ల విద్యుత్తు సరఫరాకు కారిడార్‌ను తెలంగాణ బుక్ చేసుకోవాల్సి రాగా ఈ కారి డార్ కూడా విద్యుత్తు సంస్థల ను మరింత రుణభారంలోకి నెట్టిందని ప్రభుత్వ (GOVERNMENT)వర్గాలు పేర్కొంటున్నాయి.