Anemia Prevention : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గర్భి ణులు, బాలింతలతో పాటుగా అ యిదేళ్ల లోపు చిన్నారులకు పోష కాహారం అందించడం వల్ల వారితో రక్తహీనతను దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దవచ్చ ని గుర్రంపోడు ఐసిడిఎస్ సూపర్వై జర్ సువర్ణ అన్నారు. పోషణ మా సం సందర్భంగా బుధవారం పో చంపల్లి హైస్కూల్లో విద్యార్థులకు, గర్భిణీలకు, బాలింతలకు అవగా హన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న మానవ జీవన క్ర మం లో ఆహారం పట్ల సమతుల్యత పా టించడంపై ఎవరికి తగిన అవగాహ న లేకపోవడం వల్ల గర్భిణులు, బా లింతలు, చిన్నారులు అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, కౌమారద శలో ఉన్న బాలికలు, గర్భిణీలు, పా లిచ్చే తల్లులను లక్ష్యంగా చేసుకుని ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో మంచి పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నా మని తెలిపారు.
పోషణ మాసం కార్యక్రమం ద్వారా చక్కటి అవగా హన అందుతుందని, కాబోయే తల్లులు మంచి పోషకాహారం తీసుకుంటూ అనీమియా బారిన పడకుండా ఆహ్లాదకరమైన పరిస్థితులు కల్పించుకోవాలని చెప్పారు. గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులు, మహిళలు పూర్తి స్థాయి లో పోషకాలు అంటే ఆహరం తీసు కోవాలని, తద్వారా ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టి రేపటి రాబోయే రో జుల్లో బావిభారత పౌరులు అవుతా రని పేర్కొన్నారు. గర్భిణీలు నాణ్య మైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోదక శక్తి పెరుగడం తోపాటు రక్తహీనత, శక్తి, మాంసకృ తుల లోపం, అయోడిన్, విటమిన్, ఏ, బీ లోపాలకు గురి కారన్నారు.
పౌష్టికాహారంలోపం వల్ల బరువు తక్కువగా ఉండటం, బలహీనంగా ఉండటం వంటి సమస్యలతోపాటు శ్వాస తీసుకోవడం, గుండె కదలి కలు, బుద్ధి మాంద్యం, మృత జ ననాలు, పిల్లల మరణాలు, పురిటి మరణాలు సంబవిస్తాయని తెలి పారు. ఆరోగ్యానికి ఉపయోగపడే ఆకుకూరలు, కూరగాయాలు, పం డ్లు, ధాన్యాలు, చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. అనంత రం విద్యార్థులకు బహుమ తులు అందజేశారు. ఈకార్యక్రమంలో హై స్కూల్ హెడ్మాస్టర్ భాస్కరరావు, ఉ పాధ్యాయులు కృష్ణారెడ్డి, ఏఎన్ ఎం, ఆశ వర్కర్లు, అంగన్వాడి వర్క ర్, గర్భినీలు, బాలింతలు తదితరు లు పాల్గొన్నారు.