–రాష్ట్రంలో 10,954 జీపీఓల ని యామకానికి క్యాబినేట్ ఆమోదం
–కొత్త డివిజన్లు, మండలాలకు 361 పోస్టుల మంజూరు
–33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు సైతం ఆమోద ముద్ర
–సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డిలను సన్మానిం చిన డీసీఏ, టీజీటీఏ, టీజీఆ ర్ఎస్ఏ లు
\Employees of Telangana: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల జేఏసీతోనే రాష్ట్రం లోని ప్రభుత్వ సంస్థల బలోపేతం సాధ్యమని తెలంగాణ రెవెన్యూ సంఘాల నేతలు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం కొత్త పో స్టుల మంజూరు చేస్తూ ఉందన్నా రు. గ్రామ స్థాయిలో 10,954 గ్రామ స్థాయి పరిపాలన అధికారులు (జీపీఓ), కొత్త డివిజన్లకు, మండలాలకు 361 పోస్టుల మంజూరు, 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు రాష్ట్ర క్యాబినేట్ గురువారం ఆమోద ముద్ర వేయడానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చి రెడ్డి కృషి ఫలితమేనన్నారు. రా ష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ బలోపే తానికి విశేషంగా కృషి చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మంత్రులకు, సీసీఎల్ఏ నవీన్‌మిట్టల్‌కు ప్రత్యేక ధన్యవాదా లు తెలిపారు.హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయంలో శుక్రవా రం రెవెన్యూ శాఖ ముఖ్య కార్య దర్శి నవీన్‌మిట్టల్ కి, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చి రెడ్డికి సన్మాన కార్యక్రమం జరిగింది.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ వైస్ ఛైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృ ష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఎస్.రా ములు, రమేష్ పాక, సెక్రటరీ జనరల్ ఫూల్సింగ్ చౌహాన్, మహిళా అధ్యక్షురాలు రాధ, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాతచౌహాన్, కోశాధికారి మల్లేశం, సీసీఎల్ఏ అధ్యక్షులు రాంబాబు, సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ధర్శన్గౌడ్, తదితరులు ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ నిర్ణయంతో రెవెన్యూ శాఖ బలోపేతంతో పాటు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సేవలు రైతులకు, ప్రజలకు మరింత చేరువ అవుతాయన్నారు. దూరాభారం తగ్గుతుందన్నారు. సేవలు వేగంగా అందుతాయన్నారు.
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సీసీఎల్ఏలో మహిళా దినోత్స వేడుకలను తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, సీపీఎస్, తదితర ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్‌మిట్టల్ గారు, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి గారు హాజరై మాట్లాడారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.