Encounter: ప్రజా దీవెన, ఛత్తీస్ గఢ్: ఛత్తీస్ గఢ్ లో నిన్న జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో (Encounter)మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. ఇప్పటి వరకు 31 మంది మావోల మృతదేహాలను (dead bodies of the Maoists) భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ జరుగుతోంది. మరోవైపు ఈ ఎన్ కౌంటర్లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్లు కమలేశ్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిలను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. కమలేశ్ ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందినవారు. ఊర్మిళది బీజాపూర్ జిల్లా (Urmiladi Bijapur District) గంగలూరు ప్రాంతంగా తెలుస్తోంది. మరోవైపు ఈ భారీ ఎన్ కౌంటర్ పై పౌర హక్కుల సంఘాల నేతలు స్పందించారు. మృతుల ఫొటోలు, వివరాలను పోలీసులు వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు (Supreme Court)సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.