–మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉద్ఘాటన
–ప్రభుత్వ విద్యను బలోపేతం కో సం ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం
–ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థి ని విద్యార్థులకు చేయూత
–ప్రభుత్వ పాఠశాలలో పదవ తర గతి పరీక్షల్లో ప్రతిభ ప్రదర్శించిన వి ద్యార్థులకునగదు బహుమతి, ప్రతి భా పురస్కారాలు
–మొదటి స్థానం సాధించిన వారికి రూ.15వేలు, ద్వితీయo రూ.10 వే లు, తృతీయ స్థానంకు రూ.7500 నగదు బహుమతి
–మునుగోడు నియోజకవర్గ వ్యా ప్తంగా 62 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 188 విద్యార్థినీ విద్యార్థు లను సన్మానించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి
MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: మును గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినూత్న కార్యక్ర మానికి శ్రీకారం చుట్టారు. తాను ప్రా తినిధ్యం వహిస్తున్న మునుగోడు ని యోజకవర్గంలో పరిధిలో ఇప్పటికే అనేక సరికొత్త ఆలోచన విధానాని కి అంకురార్పణ చేసిన ఎమ్మెల్యే రా జగోపాల్ రెడ్డి తాజాగా విద్యావ్యవ స్థలో సమూల మార్పులు తీసుకొ చ్చేందుకు తన వంతు విస్తృత ప్ర యత్నం ప్రారంభించారు. ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పు లు చేర్పులు తీసుకరావడం ద్వారా ప్రభుత్వ విద్య ప్రతిష్టను మరింత ఇనుమడింప చేసేందుకు తరచుగా విశ్వ ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశా లలో విద్యను అభ్యసిస్తూ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థు లకు ప్రతిభ పురస్కారాలు అందజేయాలన్న ఆలోచనను ఆచరణ లో పెట్టా రు.
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచి మొదటి రెండవ తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు తన తల్లి పేరిట ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతిభా, నగదు పురస్కారా లు అందజేసే మహత్తర కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆ యన మాట్లాడారు. ఆయన చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే…ఈ క్యాంపు కార్యాలయంలో అభి వృద్ధి పైన ఎన్నో సమీక్షలు చేశాం. కానీ అన్నింటికన్నా మంచి కార్యక్ర మం. మన సంపాదించుకున్న ధ నం పోతుంది, కానీ మనం చదివిన జ్ఞానం ఎటు పోదు. చదువుకున్న వ్యక్తి పదిమందికి సహాయంగా ఉం టాడు. చదువు లేకపోవడం వల్లనే అజ్ఞానంతో సమస్యల వలయంలో చిక్కుకుని పోతున్నారు మద్యానికి బానిస అవుతున్నారు.
పేదలు కాయ కష్టం చేసుకుంటూ తమ సంపాదనలో 75% పిల్లల చ దువుకే ఖర్చు చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివించడం ఒక స్టే ట స్ లాగా భావిస్తున్నారు. ఆలోచన నుండి బయటపడేయడానికి ఈ కార్యక్రమం చేపట్టాం.పేదల చదు వుకు గత ప్రభుత్వం చేసిన దాని కంటే ఎక్కువగానే ఖర్చుచేసి ప్రభు త్వం ముందుకు వెళుతుంది. దాం ట్లో భాగంగానే నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపడుతున్నాం.
ప్రభుత్వ విద్య బలోపేతంపై దానిని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చే యడానికి ఇప్పటికే చాలా సమీక్షలు చేశాం.నియోజకవర్గ వ్యాప్తంగా 3 30 ప్రభుత్వ పాఠశాలలున్నాయి
వాటిలో 9500 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. మే మంతా ప్రభుత్వ పాఠశాలలో చ దువుకున్న వాళ్ళమే, ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి చేరుకున్నాం.సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్లంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్లే.కొన్నేండ్లుగా పరిపాలించిన ప్రభు త్వాలు విద్య పైన ఎక్కువ నిధులు కేటాయించలేదు. బడి అంటే గుడి తో సమానం. పాఠశా లకు పంపించామని తమ బాధ్యత అయిపోయిందని పేరెంట్స్ అనుకోవద్దు.ఉపాధ్యాయులు 50% బాధ్యత తీసుకుంటే మిగతా 50 శాతం పేరెం ట్స్ బాధ్యత తీసుకోవాలి.
పిల్లలతో మాట్లాడడానికి పేరెంట్స్ సమయాన్ని కేటాయించాలి. అప్పు డే మెరుగైన సమాజాన్ని నిర్మించిన వాళ్ళమైతాం. సోషల్ మీడియా వ చ్చాక ఆన్లైన్ గేమ్ లకు బానిసలు గా మారి పిల్లలు చెడు వైపు వెళ్తు న్నారు.మారిన ప్రపంచంలో పేరెం ట్స్ పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఉదయం నుండి రాత్రి వ రకు పిల్లలు ఎక్కడ తిరుగుతున్నా రని గమనిస్తూ ఉండాలి.స్నేహితుల పట్ల, బంధువుల పట్ల,సమాజం ప ట్ల ఏవిధంగా ఉండాలని నేర్పించా ల్సింది తల్లిదండ్రులే.
ప్రభుత్వ బడి అంటేనే ఎవరు పం పివ్వము అంటున్నారు. ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయడానికి 100% నేను మీకు సపోర్ట్ చేస్తా, ప్ర భుత్వ బడులలో సంఖ్యను పెంచా ల్సిన బాధ్యత మీది. నియోజకవర్గ వ్యాప్తంగా 43 ప్రభుత్వ పాఠశాల ను అభివృద్ధి చేయాలని నిర్ణయిం చాము. ఈ 43 పాఠశాలల్లో 20వేల మంది విద్యార్థులు తగ్గకుండా చది వే లాగా మౌలిక సదుపాయాలు క ల్పించే విధంగా ప్రణాళికలు రూ పొందించాం.నేను, ఉపాధ్యాయు లందరూ తల్లిదండ్రులందరం కష్ట పడి ప్రభుత్వ పాఠశాలను అభి వృద్ధి చేసుకోవాలి.
ఈ కార్యక్రమం ఇప్పటితో ఆగి పో దు ప్రతి సంవత్సరం నిర్వహిస్తా ము.మేము 9 మంది సంతానం మా అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెం చింది. ఊరందరూ లేవక ముందే మా అమ్మ లేచేది, అందరూ పడుకు న్న తర్వాత మా అమ్మ పడుకునే ది.మా అమ్మ కష్టాన్ని కల్లారా చూ సిన నేను మా అమ్మ పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కా ర్యక్రమాలు చేపడుతున్నాను. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏ సలహా ఇచ్చిన నేను స్వీకరిస్తాను.ప్రభుత్వ బడులపై నమ్మకం కలిగించే విధం గా ముందుకు వెళ్దాం.
పదవ తరగతి పరీక్షల్లో మొదటి స్థా నం భృతీయ స్థానం సాధించిన వి ద్యార్థిని విద్యార్థులకు కృతజ్ఞతలు. మొదటి స్థానం వచ్చినవారికి 150 00, ద్వి తీయ స్థానం వచ్చిన వారికి 100 00, తృతీయ స్థానం వచ్చిన వారికి 7500 వేల రూపాయలు ఇ స్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేచింది నిద్రలేచిం ది మహిళాలోకం, దద్దరిళ్ళింది పు రుష ప్రపంచం అంటూ పాట పాడి న కార్యక్రమంలో ఉత్సాహాన్ని నిం పారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌం డేషన్ ఎప్పుడు మీకు అండగా ఉం టుందని స్పష్టం చేశారు. విద్యా ర్థు లకు సహకారం అందించడానికి సు శీలమ్మ ఫౌండేషన్ ఎప్పుడు ముం దు ఉంటుందని పునరుద్గాటించా రు.
అంతకు ముందు ప్రసంగించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగో పాల్ రెడ్డి వ్యాఖ్యలు ఆమె మాట ల్లోనే..ప్రభుత్వ స్కూళ్లను ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమం చేప ట్టాం. ప్రభుత్వ పాఠశాలలోచదివి ప్ర తిభ చూపిన విద్యార్థిని విద్యార్థు ల కు ఆర్థిక సహకారం అందిస్తూ ప్రో త్సాహం కలిగిస్తే ప్రభుత్వ పాఠశా లలు అభివృద్ధి చెందుతాయని రా జగోపాల్ రెడ్డి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ ప్రోత్సాహం మిగతా విద్యార్థిని విద్యార్థులకు స్ఫూర్తి కలిగిస్తుంది ప్రతి మండలంలో ప్రభుత్వ పాఠశా లల అభివృద్ధి ధ్యేయంగా రాజగోపా ల్ రెడ్డి పనిచేస్తున్నారు. మునుగో డు నియోజకవర్గాన్ని ఆదర్శ నియో జకవర్గంగా తీర్చిదిద్దడానికి ముం దుకు వెళ్తున్నారు మీ అందరి తో డ్పాటుతో అది సాధ్యమవుతుం దని నమ్ముతున్నాను.
రాజగోపాల్ రెడ్డి చిన్నప్పటినుండి గవర్నమెంట్ స్కూలు.నేను నర్స రీ నుండి ప్రైవేట్ స్కూలు.నేను రాజ గోపాల్ రెడ్డి అంత క్వాలిటీగా మా ట్లాడలేకపోతాను. దీన్ని బట్టి చెప్పొ చు గవర్నమెంట్ స్కూల్స్ క్యాపబి లిటీ ఏంటో అని ఉదహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజ కవర్గంలోని విద్యాశాఖ అధికారు లు, విద్యార్ధులు తల్లి దండ్రులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నా రు.