CM Revanth Reddy : శాలిగౌరారం జూలై 5. : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ శనివారం తెలిపారు. శనివారం మండల కేంద్రంలో గోపినాథ్ మాట్లాడుతూ జులై 14న తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి సమీపంలోని మాలిపురంలో నూతన రేషన్ కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేయన్నారని తెలిపారు .ఈ రేషన్ కార్డుల పంపిణీ బహిరంగ సభకు ఎమ్మెల్యే మందుల సామేలు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందాల సమరం రెడ్డి నేతృత్వంలో జూలై 14న పెద్ద ఎత్తున ప్రజలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు , యువకులు, లబ్ధిదారులు తరలిరావాలని తెలిపారు.
గత బిఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులను పేదలకు ఇవ్వలేదని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులైన పేదలందరికీ అందజేస్తుందన్నారు.శాలిగౌరారం మండల వ్యాప్తంగా సుమారు దాదాపుగా అర్హులైన 1312 మందికి నూతన రేషన్ కార్డులు మంజూరు అయ్యాయన్నారు.సుమారు 2100 మంది యాడింగ్ అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తుందన్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లబ్ధిదారులు ప్రజలు తరలిరావాలన్నారు..