Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi : కాజ్ వే పై రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

-- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

District Collector Ila Tripathi :  ప్రజాదీవెన నల్గొండ : మూసి నీటి ప్రవాహం వల్ల కేతేపల్లి మండలం భీమారం వద్ద ఉన్న లో లెవెల్ కాజ్ వే పై రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూ డాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (sp Sharath Chandra Pawar) తో కలిసి మూసి డ్యామ్ ను సందర్శించారు. నీటిపారు దల శాఖ ,ఇంజనీరింగ్ అధికారులతో మూసి ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అ వుట్ ఫ్లో, అలాగే ప్రాజెక్టు వద్ద ఉన్న సమస్యలను అడిగి తెలు సు కున్నారు.ముఖ్యంగా గేట్లకు సంబంధించి, ఇతర సమస్యలు ఏమై నా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

ప్రస్తుతం ప్రాజెక్టు నుండి బయటికి పంపిస్తున్న నీటి వివరాలను అ డగగా 13000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నట్లు ఇరి గేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ కు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలు కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామం వద్ద ఉన్న లో లెవెల్ కాజ్ వే ను తనిఖీ చేశారు. మూసి నుండి ఎక్కువ నీరు విడుదల చేసినా, లేదా ఎగువ ప్రాంతాలలో కురిసే వర్షం కారణంగా నీటి ప్రవాహం ఎక్కువైతే కాజ్ వేపై నుండి నీరు ప్రవహిస్తుందని,20 వేల క్యూసెక్కులు మూసి (Musi River) నుండి వదిలినప్పుడు మాత్రమే సమ స్య ఉత్పన్నం అవుతుందని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ విషయం పై జిల్లా కలెక్టర్, ఎస్పి లు స్పందిస్తూ భీమారం లో లెవెల్ కాజ్ వే గుండా ప్రయాణం చేసే వారిని అవసరమైతే ముం దుగానే అప్రమత్తం చేయాలని,భీమారం, కొప్పోలు నుండి రాక పోకలకు ఇబ్బందులు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసు కోవాలని, వరద ప్రవాహం పెరిగినప్పుడు అవసరమైతే కాజ్ వే పై రాకపోకలు నిలిపివేసి పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. మూసి ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ .వెంకటరమణ, డిఇ చంద్రశేఖర్, జేఈ లు కీర్తి,కేతేపల్లి డిఇ వాణి, ఎంపిడిఓ శ్రీని వాస సాగర్, తహసిల్దార్, తదితరులు ఉన్నారు.