–దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా కోటా పెంచండి
–కేంద్ర మంత్రి నడ్డాకు ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి వినతి
Chief Minister Revanth Reddy : ప్రజా దీవెన, ఢిల్లీ: తెలంగాణరాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరి యాను సకాలంలో సరఫరా చేయా లని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జె.పి.నడ్డాకు ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశా రు. కేంద్ర మంత్రిని ఢిల్లీలోని ఆయ న అధికారిక నివాసంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కలిశారు.
వానాకాలం సీజన్‌కు సంబంధించి ఏప్రిల్-జూన్ నెలల మధ్య 5 లక్షల మెట్రిక్ టన్నులకు గానూ కేవలం 3. 07 లక్షల మెట్రిక్ టన్నులు మాత్ర మే సరఫరా చేశారని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రం లో ప్రాజెక్టులకు నీరురావడం, సాగు పనులు జోరుగా సాగుతు న్నందున యూరియా సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూడాల ని కోరారు. జులై నెలకు సంబంధిం చి 63 వేల మెట్రిక్ టన్నులు దేశీ యంగా ఉత్పత్తి అయిన యూరి యా, 97 వేల మెట్రిక్ టన్నుల విదే శాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే చేశారని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు.
దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణకు పెంచాలని సీఎం కోరారు. యూరి యా సరఫరాకు సంబంధించి రైల్వే శాఖ తగిన రేక్‌లు కేటాయించడం లేదని, వాటి సంఖ్య పెంచాలని వి జ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జి తేందర్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డా క్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.