Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Erneni Babu : పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ.

–రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలి.: ఎర్నేని బాబు.

Erneni Babu : ప్రజా దీవేన, కోదాడ: రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్నేని బాబు తెలిపారు. శనివారం కోదాడ పట్టణంలో కాకతీయ కమ్మ సమక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేద ముస్లిం మహిళలకు సంఘ సభ్యులు, దాతలు నలజాల శ్రీనివాసరావు, ముత్తవరపు రామారావులతో కలిసి ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే నేడు పేద ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు.

 

ముస్లింలకు అతి పెద్ద పండుగ అయిన రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 100 మంది పేద ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నలజాల శ్రీనివాసరావు, ముత్తువరపు రామారావు, లైటింగ్ ప్రసాద్, పోటు కోటేశ్వరరావు, సాతులూరి హనుమంతరావు, సాదినేని అప్పారావు, సామినేని శ్రీనివాసరావు, కమార్ సుల్తానా, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.