Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Etala Rajender: జంటనగరాల్లో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ

–ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహ కారంతో రైల్వేల విస్తరణ
–రైల్వే మంత్రికి మల్కాజ్ గిరి రైల్వే సమస్యలపై వినతి చేశాం
— మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్

Etala Rajender:ప్రజా దీవెన, హైదరాబాద్ : దేశంలో రైల్వే వసతుల విస్తరణ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రాధాన్యతని స్తున్నారని, రూ. 2వేల కోట్లతో జంటనగరాల్లోని రైల్వే స్టేషన్ల ఆధునీ కరణ పనులను మోదీ ప్రభుత్వం చేపట్టిందని బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) పేర్కోన్నా రు. గురువారం మేడ్చల్ రైల్వే స్టేష న్, ఆర్ యూబీ పనులను పరిశీ లించి, రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లా డారు. ప్రధాని మోదీ కంటే ముందు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రైల్వే అభివృద్ధి జరగలేదన్నారు. ప్రధాని మోదీ చొరరవతో జంట నగరాల్లో నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేష న్లను (Nampally, Kachiguda, Secunderabad, Charlapally railway stations) విమానాశ్రయాలను తలపి చేలా ఆధునీకరించే పనులు చేప ట్టారని, మేడ్చల్లో కూడా 32కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతు న్నాయన్నారు. గౌడవెల్లి, గుండ్ల పోచంపల్లి, బొల్లారం. అల్వాల్, అమ్మగూడల రైల్వే స్టేషన్ల ఆధునీ కరణ పనులు కొనసాగుతు న్నాయని తెలిపారు.

మెట్రో రైలు (metro train) మాదిరిగా ఎంఎంటీఎస్లకు కూడా దగ్గర దగ్గర స్టేషన్లు ఏర్పాటు చేయ మని ఇక్కడి ప్రజలు కోరుతున్నా రని తెలిపారు. మల్కాజిగిరి పార్ల మెంటు పరిధిలో రైల్వే సమస్యల సాధనకు కేంద్ర రైల్వే మంత్రితో కల వడం జరిగిందన్నారు. వెంటనే సికింద్రాబాద్ లో ఉన్నతాధికారు లను పంపించారని, క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని సూచించారని ఈటల వెల్లడించా రు. అధికారులతో కలిసి మల్కా జిగిరి నియోజకవర్గంలో (Malka Jigiri Constituency) ఉన్న అన్ని రైల్వేస్టేషన్లను, ఆర్ యూబీలను పరిశీలన చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రపోజల్స్ అన్నీ ఢిల్లీ తీసుకుపో యి రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వ యం చేసుకుని అతి తొందరలో వీటన్నింటిని పరిష్కారం చేస్తామ న్నారు. బొల్లారం, వినాయకనగర్ గేట్ల వద్ద రెండు గంటలు పడుతుం దని, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారని.

అమ్మ గూడెం అండర్ పాస్ (Amma Goodem underpass) వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుందని ప్రజలు వివరించారన్నారు. మరో 20 సంవ త్సరాలు ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని అండర్ పాస్ (under passs) లను అభి వృద్ధి చేస్తా మని ఈటల తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంటు పరి ధిలోని రైలు నిలయం, రైల్వే ఆస్తులు, చర్లపల్లి టెర్మి నల్, అనేక రైల్వే లైన్లు ఉన్నాయని, వాటిన్నిం టిని పరి శీలించి ఎక్కడెక్కడ ఏమేమి కావాలో చూసి నిర్ణయం తీసుకుంటామని ఈటల వెల్లడింbచారు. ఈ కార్యక్ర మంలో అధికారులు సీపీఎం జీఎస్ ఏకే సింగ్, సీని యర్ డీ. ఈ.ఎన్ కోఆర్డినేషన్ ఏ. ముత్యాల నాయుడు.. అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ హైదరాబాద్. ఏ గోవిందరావు, మేడ్చల్ స్టేషన్ సుపరింటెండెంట్ లక్ష్మీ నారాయణ గారు, బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.