Even if it’s three places: ముచ్చటగా మూడు స్థానాలు అయితేనే
-- మూడు స్థానాలకు అంగీకరిస్తేనే కాంగ్రెస్ తో పొత్తు -- బిఅర్ఎస్ ఓటమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపు -- సిపిఐ కార్యదర్శివర్గ సమావేశంలో నిర్ణయం
ముచ్చటగా మూడు స్థానాలు అయితేనే
— మూడు స్థానాలకు అంగీకరిస్తేనే కాంగ్రెస్ తో పొత్తు
— బిఅర్ఎస్ ఓటమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపు
— సిపిఐ కార్యదర్శివర్గ సమావేశంలో నిర్ణయం
ప్రజా దీవెన/ హైదరాబాద్: బి అర్ ఎస్ ఓటమి లక్ష్యంగా పనిచేయాలని సిపిఐ కార్యదర్శి వర్గం సమావేశం నిర్ణయించింది. ఇదే సమయంలో మూడు అసెంబ్లీ స్థానాలకు అంగీకరిస్తే కాంగ్రెస్ తో పొత్తు ఖరారు చేసుకోవాలని అభిప్రాయపడింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం, మునుగోడు, హుస్నాబాద్ మూడు స్థానాలు నిర్మొహమాటంగా అడగాలని సీపీఐ ముఖ్యనేతలు నిర్ణయించారు.
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ భేటీ నేపథ్యంలో సీపీఐ కార్యదర్శివర్గం ప్రత్యేకంగా సమావే శమై ఈ మేరకు వెల్లడించింది.
కొత్తగూడెం, మునుగోడు, బెల్లంపల్లి, హుస్నాబాద్, వైరా స్థానాలు కావాలని సీపీఐ కోరగా రెండు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎమ్మెల్సీ కి కాంగ్రెస్ పార్టీ ఓకే అన్నట్లు తెలుస్తోంది. మునుగోడును సీపీఐకి కేటాయించేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇదిలా వుండగా సీపీఐ, సీపీఎంలు కలిసే పోటీ చేస్తాయని పునరుద్ఘాటించారు సిపిఐ నేతలు.