Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Everyone…everything is as expected: అందరూ…అంతా అనుకున్నట్లే

-- తెలుగు రాష్ట్రాల్లో ' బాబు ' కలకలం -- టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ -- అర్ధరాత్రి నంద్యాలలో అదుపులోకి

అందరూ…అంతా అనుకున్నట్లే

— తెలుగు రాష్ట్రాల్లో ‘ బాబు ‘ కలకలం
— టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్
— అర్ధరాత్రి నంద్యాలలో అదుపులోకి

ప్రజా దీవెన/ విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి సంచలనం సృష్టించే సంఘటన చోటచేసుకుంది. ఉభయ రాష్ట్రాల
రాజకీయాల్లో కలకలం( of both states
Turmoil in politics) సృష్టించేవిధంగా అంతా అనుకున్నట్లే టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేసారు. నంద్యాలలో ఉన్న చంద్రబాబు బస చేసిన క్యాంపు వద్దకు పోలీసులు అర్ద్రరాత్రి తరువాత చేరుకున్న సమయంలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది.

 

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ కు( TDP leader Chandrababu arrested) సంబందించి కారణాలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేయడంతో కేసుకు సంబంధించిన రికార్డులు తదితర వివరాలను అందించిన పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలిస్తున్నట్లు( Chandrababu was arrested and taken to Vijayawada)  తెలుస్తోంది.

నంద్యాలలో బస చేసిన చంద్రబాబు బస్సు వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు తరలివచ్చి అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్టు సమయంలో తన హక్కులు ఎందుకు ఉల్లంఘిస్తున్నారని, ఏ చట్ట ప్రకారం తనను అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటున్నారని నిలదీశారు.

తాము హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని( The primary evidence was given to the High Court) తెలిపిన చంద్రబాబు తరఫున న్యాయవాదులు పోలీసులతో వాదిస్తూ ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. శనివారం తెల్లవారుజామున చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకొని అనంతపురం నుంచి అదనపు బలగాలను( Additional forces from Anantapur)  రప్పించారు.

చంద్రబాబు హాయంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన కుంభకోణం పై సీఐడీ, ఈడీ విచారణ చేశాయి. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు పాత్ర పై చాలా రోజులుగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.

దీంతో ఈ కేసులో మరి కొంత మందిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల తరువాత విజయవాడకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం తనను అరెస్ట్ చేయవచ్చంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసాయి.

ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం( The Skill Development Scam) కేసులో చంద్రబాబును అదుపులోకి తీసుకోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.