–రైతులు, రైతు సంఘాల నేతల అభిప్రాయ సేకరణ
–ఉమ్మడి జిల్లాలో వారీగా రెండు మూడు రోజుల్లోనే శ్రీకారం
–మంత్రి వర్గ ఉప సంఘం సమావే శంలో నిర్ణయం
Farmer Assurance: ప్రజా దీవెన, హైదరాబాద్: రైతు భరోసాపై (Farmer Assurance) ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చైర్మన్‌గా, మం త్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సభ్యులుగా ఉన్న మంత్రి వర్గ ఉప సంఘం శుక్రవారం సమావేశమైంది. ఒక్కో రోజు ఒక్కో ఉమ్మడి జిల్లాలో సద స్సు ఏర్పాటు చేయాలని, మూడు రోజుల్లోనే దీనికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం సహా నలుగురు మంత్రులు ఈ కమిటీలో ఉండగా ఒక్కొక్కరు ఒక్కో ఉమ్మడి జిల్లాలో నిర్వహించే సదస్సులో పాల్గొనేలా ప్రణాళిక రచించారు. ఈ సందర్భంగా రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, (Farmers and representatives of farmers’ associations) ఇత రుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇప్పటికే ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘా ల్లో రైతు సదస్సులు నిర్వహిస్తూ అభిప్రాయాలు సేకరించారు.
సహకార శాఖ ఆధ్వర్యంలో (Under the Co-operation Department) జూన్ 29న ఈ సదస్సులు ప్రారంభంకాగా ఈ నెల 4వ తేదీకి షెడ్యూల్ పూర్త యింది. మిగిలిన పీఏసీఎస్‌ల్లో రెండు రోజుల్లోగా పూర్తి చేయ ను న్నారు. ఆ తర్వాత జిల్లా స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవై పు ప్రతి మంగళవారం రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అభిప్రాయ సేకరణ చేపడు తున్నారు. వీటిలోనూ మంత్రివర్గ ఉపసంఘం (Cabinet Subcommittee)సభ్యులు పాల్గొనాలని నిర్ణయించారు. వీడియో కాన్ఫరె న్సుల్లో మంత్రులతో నేరుగా మాట్లా డలేని రైతులు లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాలను అధికారుల కు ఇచ్చే అవకాశం కల్పించారు. అలాగే, తాజా మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌ల అభిప్రాయాలు సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. చివరిగా ఈ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి, అసెంబ్లీలో ప్రతిపక్షం ముందు పెట్టనున్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల అభిప్రాయాలు తీసుకొని, కేబినేట్‌లో చర్చించిన తర్వాత రైతుభరోసా విధివిధా నాలు ఖరారు చేయనున్నారు.