Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Deputy CM Bhatti V. Kramarka Mallu : రైతులు ఆహార భద్రత, సాంస్కృ తిక వారసత్వ సంరక్షకులు

–వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి పనిచేసింది
–ఉపాధి హామీ, వ్యవసాయ కమి షన్ కాంగ్రెస్ ప్రభుత్వాల చలువే
–దేశ ఆర్థిక నిర్మాణంలో వ్యవసా య భాగస్వామ్యం తగ్గుతుంది
–కేరళ రాష్ట్ర రైతులు కార్మికుల మ హాసభలో డిప్యూటీ సీఎం భట్టి వి క్రమార్క మల్లు

Deputy CM Bhatti V. Kramarka Mallu :ప్రజా దీవెన కేరళ: రైతులు మన ఆ హార భద్రత, సాంస్కృతిక వారస త్వానికి సంరక్షకులు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అ న్నారు. సోమవారం ఆయన కేరళ రాష్ట్రం కోజీకోడ్ జిల్లా కేంద్రంలో జి ల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏ ర్పాటుచేసిన రైతులు, కార్మికుల మహాసభలో ఆయన ప్రధాన వక్త గా ప్రసంగించారు. తెలంగాణ, కేర ళ రాష్ట్రాలలో వ్యవసాయం ఒక జీవన విధానం అన్నారు. అలాంటి వ్యవసాయ రంగం నేడు అకాల వర్షాలు, పెరిగిన పెట్టుబడులు, మా ర్కెట్ ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, మారిన వాతావరణ ప్రభావం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది అని వివరించారు.

భారతదేశ ఆర్థిక నిర్మాణంలో వ్యవ సాయ భాగస్వామ్యం క్రమంగా త గ్గుతుందన్నారు. 2016లో 17.5% కాగా ప్రస్తుతం అది 14% గా నమో దయ్యింది, అయినప్పటికీ సగం జనాభా వ్యవసాయ రంగం తోనే ముడి వేసుకుని ఉన్నారని తెలి పారు.

ఈ నేపథ్యంలో మనం చరిత్రను చూసి నేర్చుకోవాలి, స్వాతంత్రం అనంతరం కాంగ్రెస్ వ్యవసాయ రంగ అభివృద్ధికి కట్టుబడి పని చేసింది అన్నారు. స్వర్గీయ ఇంది రాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి వంటి నేతల సారథ్యంలో హరిత విప్లవాన్ని సహకారం చేశారని, అధి క ఉత్పత్తి ఇచ్చే విత్తనాలు, మెరు గైన నీటిపారుదల వ్యవస్థ, ఎరువు లు అందుబాటులోకి తీసుకువ చ్చారని తెలిపారు. ఈ చర్యల మూలంగా ధాన్యం ఉత్పత్తి 55 మిలియన్ టన్నుల నుంచి 1978- 79 నాటికి 131 మిలియన్ టన్ను లకు పెరిగింది, ఈ పరిణామం కేవ లం వ్యవసాయం వృద్ధికే కాదు కా దు గ్రామీణ ఉపాధిని ఆర్థిక శక్తిని బలోపేతం చేసింది అని అన్నారు.

రైతు పండించిన పంటలకు గిట్టు బాటు ధరలు కల్పించేందుకు కాం గ్రెస్ విజయం వేసింది, 1965 లో లాల్ బహుదూర్ శాస్త్రి మద్దతు వ్యవసాయ ధరల కమిషన్ (AP C)ను స్థాపించారు. ఇందిరా, రాజీ వ్ గాంధీల కాలంలో వ్యవసాయ ధ రల కమిషన్ ను మరింత బలో పేతం చేశారని తెలిపారు.

రైతులను స్వతంత్రులను చేసేందు కు రుణమాఫీ అవసరం అన్నారు. 2008లో మన్మోహన్ సింగ్ నేతృ త్వంలో యూపీఏ ప్రభుత్వం 71, 000 కోట్ల రుణాలను మాఫీ చేసిం ది, దీని ద్వారా దేశంలో 3.68 కోట్ల మంది రైతులకు ఉపశమనం కలి గిందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రై తుల ఆశీర్వాదంతోనే ఏర్పడింది అన్నారు. ఇప్పటివరకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం, రై తు భరోసా పథకం ద్వారా ఎకరాకు 12,000 పెట్టుబడి మద్దతుగా అం దిస్తున్నాం, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా, సన్నధా న్యం సాగుచేసిన రైతులకు క్వింటా లుకు 500 బోనస్, 10,547 కోట్ల విలువైన పంటల సేకరణ వంటి చర్యలు రైతుల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం చేపట్టినట్టు వివరించారు. సమా జాన్ని నడిపించేది అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కార్మికులే అన్నారు. తక్కువ వేతనాలు, రక్ష ణ లేని పరిస్థితులు వారి జీవితా లను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు.

స్వాతంత్ర సమరయోధుల కాలం నుంచి కాంగ్రెస్ కార్మికుల హక్కుల కోసం పోరాడింది అన్నారు. రా జ్యాంగంలోని ఆర్టికల్ 16,19, 23, 24, 39, 41, 42, 43, 43 ఏ, 54 కాంగ్రెస్ ప్రభుత్వ ప్రేరణతోనే ప్రజ లకు అందుబాటులోకి వచ్చాయి అన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రతి గ్రామస్తునికి 10 0 రోజుల ఉపాధి హామీని కల్పిం చిందన్నారు. ప్రపంచంలోనే ఇది ప్రధమ నిబంధన, ఈ పథకం గ్రా మీణుల వేతనాలు పెంచింది, వల సలను తగ్గించింది, వ్యవసాయ రం గానికి తోడ్పాటును అందించింది అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి ఉపాధి, ఆదాయాన్ని స్థిరంగా అందిస్తు న్నాం, అసంఘటిత రంగ కార్మికుల కు డిజిటల్ నమోదు ద్వారా బీ మా, పెన్షన్ వంటి సహకారం అం దిస్తున్నట్టు వివరించారు.ఆత్మీయ రైతు భరోసా పథకం ద్వారా తెలం గాణ ప్రభుత్వం భూమిలేని వ్యవ సాయ కార్మికులకు ఎకరానికి 12 ,000 ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని వివరించారు.

జిగ్ వర్కర్ల హక్కులను గుర్తించి, వారికి ఆరోగ్య భీమా, సామాజిక భద్రత కల్పించే విధానాలను తెలం గాణ ప్రభుత్వం రూపొందిస్తుంది అన్నారు.ప్రతి రైతు అభివృద్ధి ప్రయాణంలో మనం భాగస్వామి కావాలి, ఈ కార్మికుడు ఒంటరిగా ఉండకూడదు, కర్షకుడిని రక్షించం డి, కార్మికుడిని కాపాడండి అనే నినాదం ఈ సదస్సుకు ఒక కొత్త దిక్సూచి కావాలి అన్నారు.

కేరళ భూమి సాధారణమైనది కాదు త్యాగాలు, పోరాటలతో పునీతం అయింది అన్నారు. పున్నప్ర, వయలార్ వంటి ప్రజా ఉద్యమాలు వ్యవసాయ కూలీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు మరువలేనివి అన్నారు.

భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు రైతు, కార్మికుల వెంట నడిచింది, గాంధీజీ స్వరాజ్య పిలుపు నుంచి కేరళ భూ సంస్కరణల వరకు ఇది స్పష్టం అయ్యింది అన్నారు. గౌర వం అనేది ఒకరు ఇచ్చేది కాదు అ ది అందరికీ లభించాల్సిన హక్కు అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ ఆంటోని జోసఫ్ ఎమ్మెల్యే సన్నీ జోసెఫ్, డిసిసి అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.