–నాగపూర్, విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూములివ్వం
–అలైన్‌మెంట్ మార్చండి లేదంటే మార్కెట్ ధర ఇవ్వండి
–రైతుల డిమాండ్ భూపాలపల్లిలో సర్వే పనుల అడ్డగింత
Farmers:ప్రజా దీవెన, భూపాలపల్లి: నాగపూర్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఫోర్ లైన్ కంట్రోల్డ్ యాక్సెస్ ఎక్స్‌ప్రెస్ హైవే (Greenfield Four Line Controlled Access Express Highway)నిర్మాణానికి భూములిచ్చేది లేదని రైతులు బహిరంగంగానే తోసిపుచ్చుతున్నారు. తమవి ఏడాదికి రెండు పంటలు పండే నల్లరేగడి భూములని(lands), భూములి చ్చేస్తే తమ బతుకుదెరువు ఏం కావాలి అని ప్రశ్నిస్తున్నారు. ఎలై న్‌మెంట్‌ను మార్చాలని కొంద రు డిమాండ్ చేస్తుంటే మా ర్కెట్ (market)ధర ప్రకారం పరిహారం చెల్లిస్తే భూము లిచ్చేందుకు అభ్యంతరం లేదని ఇంకొందరు చెబుతున్నారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో మొత్తం 14 గ్రామాల్లోని 200 మంది రైతు లకు చెందిన 130 హెక్టార్ల భూసే కరణకు అధికారులు సర్వేకు ప్రయత్నించగా రైతులు అడ్డు తగులుతున్నారు. భారత్ మాల పరియోజన పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఈ గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ హైవేను హైబ్రీడ్ యాన్యు టీ మోడల్(హామ్)లో నిర్మించను న్నారు.
ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ నుంచి మహబూబాబాద్ (Mahbubabad) జిల్లా వెన్నారం వరకు 216.57 కిలో మీటర్ల నిడివిలో గ్రీన్‌ఫీల్డ్ ఫోర్ లైన్ రోడ్ (Greenfield Four Line Road) నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ అదికారులకు ముచ్చెమ టలు పట్టిస్తోంది. మంచిర్యాల నుంచి ఖమ్మం జిల్లా వెంకటాయపా లెం వరకు మొత్తం 1,157 హెక్టార్ల భూమి అవసరమవుతుందని నిర్ధారించారు. మంచిర్యాల నుంచి వరంగల్ వరకు మొత్తం 108.34. కిలోమీటర్ల నిడివికి గానూ 589 హెక్టార్లు అవసరమవుతుండగా ఆ భూమిని సేకరించేందుకు అధికా రులు నోటిఫికేషన్ ఇచ్చి సంబంధిత భూ యజమానులైన రైతులకు నోటీసులు జారీ చేశారు.
భూపాల పల్లి జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి (Chityala, Tekumatla, Mugullapalli) మండలాల్లోని రైతులు భూములిచ్చేది లేదని చెబుతు న్నారు. ‘పెద్దంపల్లిలో నాకు 1.20 ఎకరాలుంది. ఇందులోంచి 18 గుంటలు ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం తీసుకుంటోంది. వ్యవసాయం తప్ప వేరే జీవనాధారం లేని మేం ఉన్న భూమి కాస్తా పోతే ఎట్లా బతికేది? ప్రభుత్వం ఎకరానికి రూ.4.20 ధర కల్పిస్తామనడం చాలా భాదకరం. మార్కెట్ ధరకు అదనంగా 10 శాతం కలిపి పరి హారం ఇవ్వాలి. లేదంటే అంతే భూమి మరో చోటైనా ఇప్పిస్తే ఈ భూమి ఇచ్చేస్తా’ అని పెద్దంపల్లికి చెందిన శాస్త్రాల కిరణ్ (Shastrala Kiran) పేర్కొన్నరు.