Film actor Suman: ప్రజా దీవెన, కోదాడ: ప్రజల్లో దేశభక్తి పెంపొందించేందుకు ఇండియన్ వేటరన్ ఆర్గనైజేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని సింగారం వెళ్లే దారిలో ఐవివో రోడ్డులో ఏర్పాటు చేసిన వంద అడుగుల జాతీయ జెండాను సందర్శించి మాట్లాడారు. ఆర్మీలో దేశ రక్షణలో సేవలందించి పదవి విరమణ అనంతరం విశ్రాంతి తీసుకోకుండా ఐవివో పేరిట ప్రజల్లో దేశభక్తి పెంపొందించేందుకు చేస్తున్న సేవలను వారు కొనియాడారు.
అనంతరం పాహల్గంలో మృతి చెందిన భారతీయులకు ఆపరేషన్ సింధూర్ లో మృతి చెందిన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐవిఓ సభ్యులు హీరో సుమన్ కు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. హీరో సుమన్ కు ఐ వి ఓ స్టేట్ అడ్వైజర్ కమిటీ మెంబర్ గా రాష్ట్ర అధ్యక్షులు ఉజ్జిని రవీందర్ రావు ఆమోదంతో నియమించారు. ఈ కార్యక్రమంలో ivo స్టేట్ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ Dr G.మధుసూదన్ రావు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ సామినేని ప్రమీల . డిసిప్లేన్ కమిటీ చైర్మన్ కే వెంకన్న, యూత్ సెక్రటరీ వెస్ట్ మహాదేవ్, యూత్ వింగ్ సెక్రటరీ ఈస్ట్ నవీన్, జిల్లా కోఆర్డినేటర్ షేక్ రహీం, స్టాలిన్, నాగార్జున, నవీన్ తదితరులు పాల్గొన్నారు.