Financial assistance: ప్రజా దీవేన, కోదాడ: 2003 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు తమకు విద్య నేర్పిన గురువు పుల్లయ్య కు ఇటీవల కోదాడ లో బైక్ యాక్సిడెంట్ కి గురైన హాస్పటల్లో వైద్యం తీసుకుంటున్నా సందర్భంగా పుల్లయ్య సార్ కి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి గురువు పట్ల శిష్యులు ప్రేమను బాధ్యతను చాటుకున్నారు.
శ్రీ విద్యానికేతన్ 2003 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు గురువు పుల్లయ్య మీద ప్రేమతో ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం . జమ చేసి ఆదివారం హాస్పిటల్ కి వెళ్లి పుల్లయ్య సార్ నీ పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక లక్ష రూపాయలు పుల్లయ్య అందజేశారు అనంతరం తాను విద్యాబుద్ధులు నేర్పిన శిష్యులను ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యార్థులని దీవించారు