–అనంతపురంలో ఆగమాగం
Fire Accident: ప్రజా దీవెన, అనంతపురం: అగ్గిపుల్లే (matches)కదా అని అలుసుగా తీసు కుంటే అంతే సంగతులు. అగ్గిపుల్ల ఆగమాగం చేసిన సంఘటన అనం తపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మంగళవారం జరిగిన ఈ సంఘటన లో పెను ప్రమాదం తప్పింది. పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్ నుండి ఓ వ్యక్తి క్యాన్ లో ఐదు లీటర్ల పెట్రోల్ ( five liters of petrol)కొట్టిం చు కొని తీసుకెళ్తున్నాడు. మార్గం మధ్య లో ఓ దుకాణం వద్ద బైక్ ఆపి క్యాన్ ను బైక్ పక్కనే ఉంచా డు. అయితే, క్యాన్ పగిలిపోవ డంతో పెట్రోల్ మొత్తం కిందపో యింది. రోడ్డుపై పడిపోయిన పెట్రోల్ ను చూసుకోకుండా షాపు వద్దనే నిలబడిన వ్యక్తి బీడీ కాల్చాడు. అనంతరం అగ్గిపుల్లను కిందపడేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు భయంతో పరు గు పెట్టారు. మంటలు తొలుత పక్కనే ఉన్న మోటార్ సైకిల్ (Motorcycle) కు వ్యా పించడంతో ఓ వ్యక్తి దానిని పక్కకు తొలగించి మంటలను ఆర్చేశాడు.
పెద్దెత్తున మంటలు చెలరేగి చూస్తుండగానే రోడ్డుకు ఆనుకొని ఉన్న షాపులు, ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. అప్రమ త్తమైన దుకాణాల యాజమాను లు, స్థానికులు నీళ్లు చల్లి మంట లను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్ల యింది. మంటలు అదుపులోకి రావడంతో షాపు యాజమానులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. మంటలు వ్యాపించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో (In CC cameras)రికార్డయ్యాయి.