Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Five star hotel: వినియోగదారుని వింత కోరిక, సామాన్యుడు ఫైవ్ స్టార్ హోటల్‌లో విడిది

ప్రజా దీవెన, వారణాసి: విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఎంతోమంది ఎక్కడికైనా వాళ్ల స్థాయికి తగ్గ హోటళ్లను బుక్ చే సుకుంటారు. అందరికీ ఫైవ్ స్టార్ హోటళ్లలోనే ఉండాలని ఉన్నా వా ళ్ల ఆర్థిక స్థోమత కారణంంగా చిన్న చిన్న హోటళ్లలో బస చేస్తుంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం తన వద్ద డబ్బులు ఎక్కువగా లేకపోయినా ఫైవ్ స్టార్ హోటళ్లో ఉండాలను కున్నాడు. ఉన్నాడు కూడా. 4 రోజుల పాటు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ అన్నీ తిన్నాడు. 2 లక్షల బిల్లు కాగానే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అయితే అతనేం చెప్పి హోటల్ నుంచి వెళ్లిపోయాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఒడిశాకు చెందిన సార్థక్ సంజయ్ అనే వ్యక్తి.. వారణాసికి వెళ్లాడు. నవంబర్ 14వ తేదీన అక్కడే ఉన్న ఓ ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ గంగాస్‌కు వెళ్లి.. ఓ లగ్జరీ రూమ్‌ను బుక్ చేసుకున్నాడు. ఆపై తాళాలు తీసుకుని వెళ్లి హోటళ్లో బస చేశాడు. మొత్తం నాలుగు రోజుల పాటు హోటళ్లోనే గడిపిన సార్థక్ సంజయ్.. ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. తనకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకుని మరీ లొట్టలేసుకుంటూ తినేశాడు. ఇలా తాను 4 రోజులకు హోటల్ బుక్ చేసుకోగా.. ఆయన వచ్చిన సమయం అయిపోయింది.

దీంతో హోటల్ యాజమాన్యం చెక్ అవుట్ గురించి సార్థక్ సంజయ్‌ను ఆరా తీశారు. మొత్తం బిల్లు 2.04 లక్షలు అయినట్లు వివరించారు. అయితే నవంబర్ 18వ తేదీ రోజు సాయంత్రంలోగా తాను చెక్ అవుట్ చేస్తానని చెప్పగా.. సిబ్బంది లేదు ఉదయం 11 గంటలకే మీరు వెళ్లిపోవాలని చెప్పారు. ఎందుకంటే ఆయన చెక్ ఇన్ అయింది అదే సమయంలో కాబట్టి. కానీ సాయంత్రం వరకూ హోటల్లోనే ఉండాలనుకున్న సార్థక్ సంజయ్.. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లిపోతానని చెప్పాడు. అయితే ఎక్కువ సేపు ఉన్నందుకు గాను మరిన్ని డబ్బులు తీసుకోవద్దని సిబ్బందిని కోరాడు. దానికి వాళ్లు కూడా ఒప్పుకున్నారు.

అయితే ఈ ఘటన జరిగిన ఓ అరగంట తర్వాత సార్థక్ సంజయ్.. తన గదిలోంచి బయటకు వచ్చి తాను ఓ సందర్శన కోసం బయటకు వెళ్తున్నట్లు చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 3 గంటలు అవుతున్నా అతడు తిరిగి రాకపోవడంతో హోటల్ సిబ్బంది సంజయ్‌కు ఫోన్ చేశారు. ఎంత చేసినా ఫోన్ కలవకపోవడంతో ఆయన ఇచ్చిన మరో నెంబర్ కు ట్రై చేశారు. అది కూడా స్విచ్ఛాఫ్ అని రావడంతో ఒకరోజు వేచి చూశారు. మరుసటి రోజు కూడా రాకపోవడంతో ఇదే విషయాన్ని హోటల్ సిబ్బంది జనరల్ మేనేజర్‌కు చెప్పారు.

దీంతో మేనేజర్ ఆయన గదిలోకి వెళ్లి ఏమైం ఉన్నాయేమోనని చెక్ చేయగా.. కొన్ని జతల బట్టలు మాత్రమే లభించాయి. దీంతో సంజయ్ తమను మోసం చేసినట్లు గుర్తించిన హోటల్ నిర్వాహకులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హోటల్ సిబ్బంది నుంచి సంజయ్ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా సేకరించిన పోలీసులు ఆయనను వెతికే పనిలో పడ్డారు.