— సామాజిక మాధ్యమం వేదికగా మాజీ సీఎం జగన్ ఆగ్రహం
Former CM Jagan: ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రంలో పొగాకు పంటకు కనీ స మద్దతు ధర రాక రైతులు అన్యా యానికి గురవుతుంటే, వారిని పరా మర్శించడానికి వస్తే మాపైనే తిర గబడతారా అని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న దాతలు ఎదుర్కొంటున్న సమస్యల పై ఆయన శనివారం తన ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. రైతులకు భరోసా నిచ్చేందుకు నిన్న ప్రకాశం జిల్లా పొదిలి వెళ్తే తానేదో విషయా న్ని డైవర్ట్ చేసేందుకు చేస్తున్నానని అనడం చంద్రబాబు మీకు ఇదీ భా వ్యమా అని ప్రశ్నించారు.
తమ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్ర జలు తరలివచ్చారని తెలిపారు. తాము వెళ్తున్న మార్గంలో 40 మం ది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసి గొల్పి రాళ్లు విసిరి గలాటా చే యించారని ఆరోపించారు. ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసు కుని అత్యంత సంయమనంతో వ్య వహరించారని ధ్వజమెత్తారు. హిం సను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యల పై న, అక్కడున్న 40 వేల మంది ప్ర జలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబు అం టూ ఆక్షేపించారు. రైతుల సమస్య లపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయ డానికి మీరు అడ్డగోలు ఆరోపణలు చేయడం దుర్మార్గం కాదా అంటూ జగన్ తన ట్వీట్ లో ప్రశ్నించారు.