Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MP Etela Rajender : మాజీ మంత్రి, ఎంపీ ఈటెల రాజేం దర్ ఘాటువ్యాఖ్యలు, నిజాయితీ, నిబద్ధతలేక కాంగ్రెస్ చేతులెత్తేసింది

MP Etela Rajender : ప్రజా దీవెన, హుజురాబాద్: రాష్ట్రం లో అధికార కాంగ్రెస్ పార్టీకి నిజా యితీ, నిబద్ధత లేక బీసీ రిజర్వే ష న్లపై హైకోర్టు తీర్పుతో పాటు సర్వ త్రా గందరగోళ పరిస్థితులు నెలకొ న్నాయని మాజీమంత్రి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రా జేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తా రు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వంచ నకు పాల్పడకుండా, మోసం చేయ కుండా, దగా చేయకుండా, 42 శా తంతో తక్షణమే ఎన్నికలు నిర్వహిం చాలని డిమాండ్ చేశారు. శుక్ర వా రం హుజురాబాద్ పర్యటనలో భా గంగా నిర్వహించిన మీడియా స మావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా సమావేశంలో ఈటెల రా జేందర్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…

రెండేళ్లు అయినా ఎన్నికలు జరగలే దు. ఆరు నెలల్లోనే 42 శాతం రిజ ర్వేషన్లు తీసుకొచ్చి ఎన్నికలు జరు పుతామని చెప్పారు కదా. ఏం మొ హం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడు గుతారు. నాకు పదవుల కంటే కూ డా ప్రజలు ముఖ్యం. ప్రజల సమ స్యల పరిష్కారం ముఖ్యం. ఆపద లో ఉన్నప్పుడు అండగా ఉండటం ముఖ్యం అని భావించేవాణ్ణి. అడ్జస్ట్ అయ్యేది ఉంటే కేసీఆర్ దగ్గరే ఉం డేవాడిని కదా. ఈటల రాజేందర్ అంటే నికార్సైన ఉద్యమ బిడ్డ. ఎ క్కడ అన్యాయ మున్న కొట్లాడే బి డ్డ. ఇది నేను బొందలోకి పోయిన ప్పుడే పోతది. తెలంగాణ చరిత్ర రా సినప్పుడు ఒక ఐదు పేజీల చరిత్ర నాది కూడా ఉంటుంది.

25 ఏళ్లుగా నేను హుజురాబాద్లో ఉ న్నాము. కొత్తగా రాలేదు. ఇప్పటివ రకు జరిగిన ఏ ఎన్నికల్లో ఆయన గె లుపు మాదే. సముద్రమంత బల గం ఇక్కడ నాకు ఉంది.నేను బిజె పిలోకి వచ్చిన తర్వాత మొదటి సా రిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరు గుతున్నాయి. 25 ఏళ్లుగా నాతో పాటుగా ఉన్న వాళ్ళని గెలిపిం చు కునే బాధ్యత నా మీద ఉంది. గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వార్డు మెంబర్లు, సర్పం చులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు కావాలి అనుకున్న వారు ఏమైతుంది అనే ఆందోళనలో ఉన్నారు.వాస్తవానికి ఇంత ఆందోళన అవసరం లేకుండే.

ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభు త్వం ఈ గందరగోళం సృష్టించింది.

ప్రజలను, రాజకీయ నాయకులను, ముఖ్యంగా న్యాయ నిపుణులు కూ డా విస్మయపరిచే పద్ధతిలో వారు వ్యవహరించిన తీరు తెలంగాణ స మాజాన్ని భాదించింది. తెలంగాణ లో 85 శాతం మంది బడుగు బల హీన వర్గాలు ఉన్నారు. బీసీలకు 4 2 శాతం రిజర్వేషన్ ఇస్తామని కా మారెడ్డిలో డిక్లరేషన్ చేసిన విధంగా అమలు చేయాలని భారతీయ జన తా పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. అందుకోసమే బాజప్తా అ సెంబ్లీలో, కౌన్సిల్లో మద్దతు ఇచ్చా ము. కానీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి, నిజాయితీ, కమిట్మెంట్ లేక ఇవాళ చేతులు ఎత్తేసింది.

ప్రజాక్షేత్రంలో అభాసు పాలయ్యిం ది.కాంగ్రెస్ కొత్త పార్టీ కాదు, రేవంత్ కొత్త నాయకుడు కాదు. 50 ఏళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇంత పేలవంగా, అనాలోచితంగా, ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తారని ఎవరు అనుకోలేదు. మోసం చేసే వారిని ప్రజలు ఇష్టపడతారు, మో సం చేస్తేనే నమ్ముతారు అనే ఫిలా సఫీ ఉన్నవాడు కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేశా రు, వంచించారు. దీనికి పూర్తి బా ధ్యత కాంగ్రెస్ పార్టీదే. ఇదే కమ లాపూర్ లో ప్రెస్ మీట్ పెట్టి 42% రి జర్వేషన్లు తప్పకుండా అమలు కా వాలి అని చెప్పాను. మా మద్దతు ఏం కావాలో చేస్తామని చెప్పాను.

గవర్నర్, రాష్ట్రపతి ఆపడానికి ఏం లేదు.తప్పకుండా మద్దతు ఇస్తామ ని చెప్పాము.జ్ఞానం ఉండాలి, ఎ వరి సలహాలు పాటించారు. వారికి తెలియాలి కదా. బీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్రానికి సంబంధించింది కాదు రాజ్యాంగ సవరణ హక్కు పా ర్లమెంటుకు ఉంటుంది. అయినా 4 2 శాతం ఇస్తా అంటే ప్రజలు నమ్మా రు. కానీ వీరి డ్రామా జంతర్మంతర్లో ధర్నా చేసినప్పుడే అర్థం కావాలి. రేవంత్ రెడ్డికి, రాష్ట్రంలో ఉన్న కాం గ్రెస్ పార్టీకి 42 శాతం అమలు చేసే సత్తా ఉండి ఉంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు ఎందుకు పోయారో అని అర్థం కావాల్సి ఉండే.

మంత్రులు షెడ్యూల్ వచ్చిన త ర్వా త ఏ పార్టీ వారు కూడా కోర్టుకు పో కండి మాకు సహకరించండి అని కో రారు. మీరు చేసే పని రాజ్యాంగ బ ద్ధంగా ఉంటే ఇంకొకరి సహకారం అ వసరం ఏముంది. ఒక మంత్రి కోర్టు తీర్పు అనుకూలంగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అయినా తీర్పు రాకముందే అదరాబాదరగా నిన్న పొద్దున నామినేషన్ల ప్రక్రియ షురూ చేసి ఇచ్చారు. దీంతో ఎంత అబా సు పాలయ్యారు అర్థం కావాలి.

జీవితాంతం బీసీల హక్కుల కోసం కొట్లాడే సంఘాలు నాయకులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

మనకు అనేక మంది న్యాయనిపు ణులు ఉన్నారు. జస్టిస్ ఈశ్వర య్య కుండ బద్దలు కొట్టినట్టు చె ప్పారు. ఇది నిలిచేది కాదు.. ఇట్లా చేయడం బావ్యం కాదు, ఎవరిని మోసం చేస్తున్నారన్నారు.ఇది ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు.. ఇది ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్ల లు ఉన్నారు. రాజ్యాంగం పట్ల అవ గాహన ఉంది. చట్టం మీద అవగా హన ఉంది, ఈ పని చేయవద్దు అ ని చెప్పారు. అయినా కొంతమంది సంఘాల నాయకులు సంఘాలు బిజెపి వ్యతిరేకిస్తుంది అని చెప్పి వాదన చేస్తున్నారు ఇది పసలేని వాదన.

దేశం మొత్తంలో జనాభా ప్రాతిప దికన రిజర్వేషన్లు కలిగినవి రెండే రెండు ట్రైబల్, షెడ్యూల్ క్యాస్ట్ వారు.ఎంత ఉంటే అంత శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. నార్త్ ఈ స్టర్ స్టేట్స్లలో 90 శాతం ఉంటే 90% రిజర్వేషన్లు ఉన్నాయి.అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇప్ప టికైనా కాంగ్రెస్ పార్టీ చెంపలు వేసు కుని క్షమాపణ చెప్పి వెంటనే ఎన్ని కలు జరిపించాలని డిమాండ్ చేస్తు న్నాను. గాంధీ చెప్పినట్లు గ్రామ స్వ రాజ్యం జరగాలంటే గ్రామ సచివాల యాలు, మండల కార్యాలయాలు, జిల్లా పరిషత్తులు గొప్పగా నడపా లి. 73, 74 వ రాజ్యాంగ సవరణ రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు అని మర్చిపోతున్నారు. రెండేళ్లు అయి నా ఎన్నికలు జరగలేదు. ఆరు నెల ల్లోనే 42 శాతం రిజర్వేషన్లు తీసు కొచ్చి ఎన్నికలు జరుపుతామని చె ప్పారు కదా. ఏం మొహం పెట్టుకొని ప్రజలకు ఓట్లు అడుగుతారు.

మహారాష్ట్రలో ఎన్నికలయ్యి గె లి చిన తర్వాత పదవులు పోయాయి.

బీహార్ లో మా ప్రభుత్వము ఉంది కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, రిజ ర్వేషన్లను కోర్టు కొట్టివేస్తే ఏమి చే యలేకపోయాము. ఇంత చరిత్ర ఎ దురుగా కనిపిస్తున్న ప్రజలను మో సం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ప్ర జలను గోల్మాల్ చేసే ప్రయత్నం చే యటం మంచిది కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వంచనకు పాల్పడ కుండా, మోసం చేయకుండా, దగా చేయకుండా, 42 శాతంతో తక్షణ మే ఎన్నికలు నిర్వహించాలని డి మాండ్ చేస్తున్నాను. గతంలో పని చేసిన వార్డు మెంబరు సర్పంచుల కు బిల్లులు రాలేదు వెంటనే బిల్లు లు చెల్లించాలని డిమాండ్ చేస్తు న్నాను. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బి ల్లులు ఇస్తున్నారు తప్ప వీరివి ఇ వ్వడం లేదు. పోయిన దసరాకి బిల్లులు ఇస్తామని చెప్పారు కానీ ఈ దసరా వచ్చినా బిల్లులు ఇవ్వ లేదు.

పనులు చేసిన వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ ఎన్ని కలలోపే పాత బిల్లులు అన్ని కమి షన్లు లేకుండా చెల్లించాలని డిమాం డ్ చేస్తున్నాను. రెసిడెన్షియల్ స్కూ ళ్లలో డైట్ చార్జీలు రావడం లేద,

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రాక ఆరు నెలలు అవుతుంది.

పిల్లలకు బువ్వ పెట్టే పరిస్థితి లేక స ప్లయర్స్ వెళ్లి కలెక్టర్స్ ముందు ధ ర్నా చేస్తున్నారు. మీకు సిగ్గు ఉం డాలి కదా, జ్ఞానం ఉండాలి కదా పిల్లలు కదా, వారికి కూడా బువ్వ పెట్టలేరా, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్నవారు దళితుల ట్రైబల్స్ పి ల్లలు గరీబోళ్ల పిల్లలు. మిడ్డే మె యిల్స్ కూడా డబ్బులు ఇవ్వడం లేదు. ఆలస్యం చేయకుండా వెం టనే డబ్బులు ఇవ్వాలి. మిమ్మ ల్నితూ అని అంటున్నారు. అంగ న్వాడీలు ఆశ వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు 9 నెలలుగా జీతా లు లేవు.

మీరు ఎగబెడుతున్నది డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది పేద ఉద్యోగులను. చిన్న ఉద్యోగుల కు కూడా డబ్బులు ఇవ్వలేకపోతు న్నారు. తక్షణమే ఎన్నికలకు ముం దు ఈ బాకీలన్నీ చెల్లించాలి.గెస్ట్ లెక్చరర్స్ గురించి నేను అసెంబ్లీలో మాట్లాడాను..9 నెలల జీతం ఇస్తు న్నారు బుద్ధుందా? 12 నెలలు ఇ వ్వాలి కదా. జీతభత్యాలు కాదు క దా కనీసం రెన్యువల్ కూడా చేయ డం లేదు. మంత్రుల కాళ్ళ మీద పడ్డా కనికరించడం లేదు. గెస్ట్ లెక్చ రర్లు అన్నమో రామచంద్రా అని ఆ గం అవుతున్నారు.కెసిఆర్ వీరం దరినీ సతాయిస్తున్నాడనే కదా నీ కు ఓట్లు వేసి గెలిపించింది. చతికిల పడ్డ పార్టీ.. నీ గొప్పతనంతో గెల వ లేదు. ఇలాంటి వర్గాలన్నీ పట్టు పట్టి కెసిఆర్ ని కాదని మీకు ఓటు వేస్తే గెలిచారు.

కనీసం మీ దగ్గరకు వస్తె మర్యాద కూడా ఇవ్వడం లేదంట. చెప్తూనే ఉంటావా అని బెదిరిస్తున్నారట.

ఇది ప్రజాస్వామ్యం అనే విషయం మర్చిపోవద్దు. హెల్త్, ఎడ్యుకేషన్ వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న చిన్న జీ త గాళ్లందరికీ డబ్బులు చెల్లించాలి.

రిటైర్మెంట్ అయితే అదే రోజు చెక్కు లు అప్పజెప్పి పంపిస్తామని చెప్పా రు కానీ ఆ రిటైర్డ్ ఎంప్లాయ్ రెండు సంవత్సరాలైనా రిటైర్మెంట్ బెనిఫి ట్స్ వస్తలేవు. కమిషన్ ఇస్తేను కోర్టు కు పోతేనే తప్ప రావడం లేదు.

మీరు వచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా..అప్పుల గు రించి మీరే కదా అనేకసార్లు అసెం బ్లీలో మాట్లాడింది. అన్ని తెలిసే క దా హామీలు ఇచ్చింది. ఎండాకా లంలో కొనుగోలు చేసిన సన్న ఓ ట్లకు ఇప్పటివరకు 500 రూపా య ల బోనస్ రాలేదు. రుణమాఫీ పూర్తి గా కాలేదు ఘట్కేసర్ మండలంలో ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కా లేదు.

తెలంగాణ ప్రజలకు బిసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మేము రిజర్వే షన్లు కావాలని కోరుకుంటున్నాము. మేము మీతో ఉన్నాము. ముక్కు పిండుతాం. మీరు ఎక్కడికి రమ్మం టే అక్కడికి వస్తాము. ఒక తమి ళ నాడు మాత్రమే సక్సెస్ అయ్యింది ఎందుకు సక్సెస్ అయిందో స్టడీ చేసి రమ్మని చాలాసార్లు చెప్పాను. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి చట్టబద్ధత కల్పించి సుప్రీంకోర్టు ఏ విషయాల్లో కన్విన్స్ కావాలో అవన్నీ చేస్తే వచ్చింది.

జనాభా లెక్కలు కావాలంటే స్టా టి కల్ డిపార్ట్మెంట్ చేయిస్తావా. బిసి కమిషన్ వేస్తావా.. డెడికేషన్ కమి షన్ రిపోర్ట్ ఎక్కడ. అభిప్రాయల సేకరణ ఎక్కడ చేసావు. అంత ఆ దరాబాదరా.. గోల్మాల్.. అబద్దాల పునాదుల మీద నడిపించారు. స మన్వయం లేదు.

హైడ్రా మీద నేను మాట్లాడినప్పుడు చాలామంది తప్పుపట్టారు.ఆయన వ్యక్తిగత అభిప్రాయమా అన్నారు. ప్రోగ్రెసివ్ స్టెప్ అని చెప్పారు. కానీ మూడు నెలల తర్వాత అర్థమైంది.. హైడ్రా పేదల గుడిసెలు ఎలా కూల గొట్టింది.. వారి బ్రతుకుల్లో మట్టి ఎలా కొట్టిందో అర్థమైంది.నన్ను విమర్శించినా కూడా కొట్లాడాను. మూసిలో పిల్లలు ఈతలు కొట్టేలా గా మంచినీళ్లు రావాల్సిందే కానీ ఆ మూసి పేరిట వ్యాపారం చేసి పేదల ఇల్లు కూలగొడతానంటే ఖబర్దార్ అని హెచ్చరించాను. నేను ప్రశ్నిస్తే మూసి బాగుపడ వద్దా అన్నారు.

నేను బాగుపడవద్దు అనలేదు.. దోమలు ఉండకుండా చేయండి, వాసన రాకుండా చేయండి.. బ్ర హ్మాండంగా చేయండి ఎవరు వద్ద న్నారు… కానీ కూలగొడితే మాత్రం వదిలేదు అని చెప్పాను. నాకు బ ట్టలు కావాలా బంగారం కావాలంటే ముందు బట్టలు కావాలని కోరు కుంటాం .

పిల్లలకు బువ్వ పెట్టే దిక్కులేవు గా ని లక్షన్నర కోట్ల రూపాయలతో మూసి బాగు చేస్తా అంటే ఇదంతా బోగస్ అని ఆరోజు నేను చెప్పాను.

ఎక్కడో పెద్దవాళ్లతో మాట్లాడుకుని వచ్చి వారికి కట్టబెట్టే చర్య అని చె ప్పాను. డబ్బుల మీద ధ్యాస తప్ప ప్రజల మీద కాదు అని చెప్పాను.

తర్వాత అర్థమైంది అందరికీ. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను చ ట్టసభల్లో వివిధ పాత్రలు పోషిం చా ను. ఫ్లోర్ లీడర్ గా, మంత్రిగా పని చేశాను. ఎట్ల కనిపిస్తున్న వీళ్లకు.

ఎప్పటికైనా ప్రజలకు తోడుగా అం డగా ఉండేవాళ్ళం మేము. పద వుల కోసం పెదవులు మూసే వా ళ్ళం కాదు.నా క్యారెక్టర్.. కమి ట్మెం ట్.. ఫైటింగ్ నేచర్ నాది. పక్కా ప్రజ ల పక్షాన్ని ఉంటాను. ఎక్కడ ఎవరు సమ్మెలు చేసినా, ధర్మ యుద్ధం చే సిన, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేది మేము.

మీకు ఎల్లవేళలా అండగా ఉంటా మని హామీ ఇస్తున్నాము. ఎవరికి భయపడే వాళ్ళం కాదు. పదవుల కంటే కూడా ప్రజల ముఖ్యం. ప్రజల సమస్యల పరిష్కారం ముఖ్యం.

ఆపదలో ఉన్నప్పుడు అండగా ఉం డటం ముఖ్యం అని భావించేవాణ్ణి.

అడ్జస్ట్ అయ్యేది ఉంటే కేసీఆర్ దగ్గ రే ఉండేవాడిని కదా. ఆర్టీసీ సమ్మె జరిగిన రోజు కేసీఆర్ మీరు చేస్తుం ది తప్పు అని చెప్పాను. సమ్మెలు చేయవద్దు సంఘాలు ఉండవద్దు అని చెప్పినప్పుడు సంఘాలు ఉం టాయి సమ్మెలు చేస్తాయి అని మం త్రిగా ఉండి స్టేట్మెంట్ ఇచ్చిన వాడిని నేను. చంద్రబాబు నాయుడు ము ఖ్యమంత్రి దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వరకు ఎంతోమంది ముఖ్యమంత్రి తో కొట్లాడిన. రాజశేఖర్ రెడ్డి ఏం మాట్లాడారో మీ అందరికీ తెలుసు.

ఒక్క రూపాయి ఇవ్వను అన్న రోజు నేనేం మాట్లాడాను చూశారు.

ఇదంతా పాత చరిత్ర అనుకుం టు న్నారు.. పాత చరిత్ర యొక్క కొన సాగించే జీవితం చచ్చిపోయేం తవరకు అదే ఓరవిడితో ఉంటాము

ఈటల రాజేందర్ అంటే నికార్సైన ఉద్యమ బిడ్డ. ఎక్కడ అన్యాయ మున్న కొట్లాడే బిడ్డ. ఇది నేను బోం దలోకి పోయినప్పుడే పోతది.

తెలంగాణ చరిత్ర రాసినప్పుడు ఒక ఐదు పేజీల చరిత్ర నాది కూడా ఉం టుంది. ఎప్పుడూ ఉద్యమాల చరి త్రను చెడిపిస్తే జరగదు. ఉద్యమ నాయకులను మలినం చేస్తే పోదు.

ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చలగాటమాడే ప్రయత్నం చేసిన, గోల్మాల్ చేసే ప్రయత్నం చేసిన కాప లా కుక్కల ఉంటాను అని గుర్తు చే స్తున్న..కాంగ్రెస్ నాయకులు అవ గాహన లేకుండా మాట్లాడుతు న్నా రు అవగాహన లేకుండా పనులు చే స్తున్నారు అందుకనే కోర్టుల ముం దు బోల్తా పడ్డారు. హామీ ఇచ్చింది మీరు నిలబెట్టుకోవాల్సింది మీరే.

 

27 శాతం OBC మంత్రులు ఉన్న ఏకైక క్యాబినెట్ మోదీ క్యాబినెట్.

దేశానికి ఓబిసి ముఖ్యమంత్రిని అం దించిన పార్టీ భారతీయ జనతా పా ర్టీ కాదనే దమ్ము ఎవరికన్నా ఉందా.

ఒక మైనారిటీని ఒక దళితుడిని ఒ క ఆదివాసిని రాష్ట్రపతిని చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీది.

దేశవ్యాప్తంగా బీసీ జన గణన జర గాలని ఒక కమిషన్ వేసి జనగణన చేసి బీసీల జీవితాల్లో వెలుగు నింప గలిగిన సత్తా కమిట్మెంట్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీదే.ఇది మా కమిట్మెంట్. మీది డ్రామా కంపెనీ.

మీరు పాలించలేదా ఈ దేశాన్ని ఏ మన్నా కొత్తగా వచ్చారా.రాజీవ్ గాం ధీ రిజర్వేషన్ ఇస్తే మెరిట్ చచ్చిపో తుంది అని మాట్లాడలేదా. రిజర్వే షన్ ఇస్తే మెరిట్ చచ్చిపోదు డీమ్డ్ విశ్వవిద్యాలయాల పేరుతో సీట్లను అమ్ముకుంటే చచ్చిపోతుంది.

 

మార్కులు రాకపోయినా పైస లుంటే చాలు అనే దగ్గర చచ్చి పో తుంది. అవన్నీ ఇప్పుడు మాట్లా డతలేము. మా తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ తో ఎన్నికలు నిర్వ హించాలని కోరుతున్నాం. పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరు తున్నాం. ఇది చేయి చాలు. 25 ఏళ్లుగా నేను హుజురాబాద్లో ఉ న్నాము. కొత్తగా రాలేదు. ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లో ఆయన గెలుపు మాదే. సముద్రమంత బ లగం ఇక్కడ నాకు ఉంది.నేను బి జెపిలోకి వచ్చిన తర్వాత మొద టిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి.. 25 ఏళ్లుగా నా తోపాటుగా ఉన్న వాళ్ళని గెలిపిం చుకునే బాధ్యత నా మీద ఉంది.

సర్పంచులు గా ఎంపిటిసిలుగా జె డ్పిటిసిలుగా పని చేసే వారిని గెలి పించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు కాలుకు ముళ్ళు విరిగితే పంటితో మీకే విధంగా సర్వీ స్ చేస్తామంటూ స్పష్టం చేశారు ఈటెల రాజేందర్.