Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ఉద్యమం అంటేనే కేసీఆర్ త్యా గం, ఆయన చేసిన పోరాట ఫలిత మే నేటి తెలంగాణ, నవంబర్ 29 కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే డి సెం బర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదని మాజీ మంత్రి, సిద్ది పేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ అంటేనే పోరా టం, త్యాగం అని, రేవంత్ అంటే వెన్నుపోటు, ద్రోహం అంటూ ఘా టు వ్యాఖ్యలు చేశారు. మంగళవా రం తెలంగాణ భవన్ లో నిర్వహిం చిన విజయ్ దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగా ణ తల్లి విగ్రహానికి, అంబేద్కర్ చిత్ర పటానికి,ప్రొఫెసర్ జయశంకర్ విగ్ర హానికి పూలమాలవేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
నా శవం మీద తెలంగాణ జెండా క ప్పండని ప్రాణ త్యాగానికి తెగించి పోరాడిన గొప్ప నాయకుడు కేసీఆ ర్, రేవంత్ సమైక్యవాదుల బాటలో నడుస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ అ స్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. తెలం గాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదు, అది పోరా టం లో పుట్టిన భావోద్వేగం. నాడు ఉ ద్యమకారులపై తుపాకీ పట్టుకున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డినేడు త ల్లి విగ్రహాన్ని మారుస్తున్నారు.
అమెరికాలో మన బిడ్డలను జైల్లో వే సిన ట్రంప్ పేరును హైదరాబాద్ రో డ్డుకు పెడతావా? ఇది భారతీయు లను అవమానించడమే. నాడు తె లంగాణ వెనుకబడ్డది కాదు వెనుక బడేయబడ్డది, నేడు రేవంత్ పాల నలో మళ్లీ వెనుకబాటుకు గురవు తోంది. డిసెంబర్ 9 తెలంగాణ చరి త్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ బ డిన రోజు, నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితమే డి సెంబర్ 9 నాటి తెలంగాణ ప్రకటన.
నాడు కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడకపోతే డిసెంబర్ 9 ప్ర కటన వచ్చేది కాదు. నేడు మనం చూస్తు న్న జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం ఉండేది కాదు. కేసీఆర్ దీక్ష, అమ రుల త్యాగ ఫలితమే ఈనాటి తె లంగాణ రాష్ట్రం. చరిత్ర గురించి మాట్లాడితే కేసీఆర్ అంటే పోరా టం, కేసీఆర్ అంటే త్యాగం. కానీ రే వంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, రేవం త్ అంటే ద్రోహం. తెలంగాణ ఉద్య మ సమయంలో రాజీనామాలు చే యమంటే జిరాక్స్ పేపర్లు ఇచ్చి మో సం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి.
ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టు కొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి ఆ యన. అలాంటి వ్యక్తి నేడు తెలంగా ణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ చరిత్ర హీనుడిగా మిగిలిపోతున్నాడు.
తెలంగాణ తల్లి అనేది ఉద్యమ భా వోద్వేగాల మధ్య, పోరాట స్ఫూ ర్తి తో పుట్టిన రూపం. ప్రజలు స్వచ్ఛం దంగా ఊరూరా, వాడవాడలా విగ్ర హాలు పెట్టుకొని పూజించుకుం టు న్న తల్లిని రేవంత్ రెడ్డి మార్చాలను కోవడం దుర్మార్గం.
రేవంత్ సృష్టించినది నకిలీ తల్లి, ఆ తల్లి చేతిలో నుండి మన సంస్కృతి కి ప్రతీక అయిన బతుకమ్మను తీ సే సిన దుర్మార్గుడు రేవంత్. జై తెలం గాణ అనని, ఉద్యమంలో జైలుకు వెళ్ళని రేవంత్ రెడ్డికి తెలంగాణ త ల్లి విగ్రహాన్ని మార్చే హక్కు లేదు.ఎన్నికల ముందు తలరాతలు మా రుస్తానని చెప్పి, ఇప్పుడు తెలంగా ణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నాడు.
చేసింది శూన్యం.. ఎరువుల కొరత తెచ్చాడు, విత్తనాల ధరలు పెంచా డు, కరెంటు కోతలు తెచ్చాడు, రై తుబంధు ఎగ్గొట్టాడు. రైతు బీమా డబ్బులు కూడా కట్టకుండా రైతు ల ను గోస పెడుతున్నాడు. కాకతీయ తోరణాన్ని, చార్మినార్ ను చిహ్నం నుంచి తొలగిస్తానంటాడు. రవీంద్ర భారతి కంటే రామోజీ ఫిలిం సిటీ గొ ప్పదని మాట్లాడి తెలంగాణ అస్తి త్వాన్ని దెబ్బతీస్తున్నాడు.కాళోజీ, దాశరథి, గద్దర్ లను చిన్న చేసి మా ట్లాడుతున్నాడు.అమెరికాలో మన తెలుగు పిల్లలకు బేడీలు వేసి జైల్లో పెట్టిన ట్రంప్ పేరును హైదరాబాద్ రోడ్డుకు పెడతాడట. పన్నులు పెం చి, వీసాలు కఠినం చేసి భారతీ యులను ఇబ్బంది పెడుతున్న ట్రం ప్ పేరు పెట్టడం అంటే భారతీయు లను అవమానించడమే.
మన పిల్లల ఉద్యోగాలు ఊడగొడు తున్న వ్యక్తికి నీరాజనాలు పడతా వా రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న తె లంగాణ ఇస్తామని ప్రకటించి, ఆ త ర్వాత వెనక్కి తీసుకున్న సోనియా గాంధీని నాడు బలి దేవత అన్నది రేవంత్ రెడ్డే. ఇప్పుడు ఆ సోనియా గాంధీకి గుడి కడతామంటున్నాడు. నాడు తెలంగాణ వెనక్కి తీసుకున్న ప్పుడు మన యువకులు బలిదానా లు చేసుకున్నారు. సోనియాగాంధీ పేరు మీద ఉత్తరం రాసి ఏఐసీసీ కా ర్యాలయం ముందు ఆత్మహత్య చే సుకున్నారు యాదిరెడ్డి.యాదిరెడ్డి పార్థివ దేహాన్ని ఏపీ భవన్ కు కూ డా రానివ్వని దుర్మార్గపు పాలన అ ది.
ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు. కేసీఆర్ గారు అంటేనే త్యాగాలు.
బహుశా దేశంలో ఒక కాస్ కోసం ఇ న్ని పదవులకు రాజీనామా చేసిన నాయకుడు ఎవరైనా ఉంటే అది కేసీఆర్. పదవులే కాదు ప్రాణ త్యా గానికి కూడా సిద్ధపడ్డ గొప్ప నాయ కుడు కేసీఆర్.నిమ్స్ లో కేసీఆర్ కి సోడియం లెవెల్స్ తగ్గిపోయినా యి. కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి మనిషి చనిపోతాడని డాక్టర్లు మా కు చెప్పారు. నేను పోయి కేసీఆర్ కి దీక్ష విరమించుకోవాలని చెప్పే ప్ర యత్నం చేస్తే, నాకే తిరిగి ధైర్యం చె ప్పి తెలంగాణ వచ్చేవరకి నా ప్రా ణం పోదు మనం కొట్లాడుదామని అన్నాడు కేసీఆర్. అయితే జైత్ర యాత్ర లేకపోతే శవయాత్ర అని కేసీఆర్ తేల్చి చెప్పారు.
నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అని చెప్పిన గొప్ప నాయ కుడు. ఆయన ఉద్యమంలో ఆమర ణ దీక్ష వల్ల, పోరాటం వల్ల వారి ఆ యుష్షు పది సంవత్సరాలు తగ్గింది.
దేవుని దయవల్ల, తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నారు కేసీఆర్ ఇప్పుడు. తెలం గాణ ప్రజల పక్షాన కేసీఆర్ పోరా టం చేస్తారు. కచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పదా న్నే నిషేధించారు. తెలంగాణ వెనుక బడ్డది కాదు వెనుకబడేయబడ్డది అని జయశంకర్ చెప్పేవారు. కేసీ ఆర్ పోరాటం వల్ల, తెలంగాణ రావ డం వల్లే నేడు 24 గంటల కరెంటు, ఇంటింటికి నీళ్ళు, కోటి ఎకరాల మాగాణి సాధ్యమైంది. తలసరి ఆదాయంలో, వరి ధాన్యం ఉత్ప త్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది.
కానీ నేడు రేవంత్ రెడ్డి పాలనలో తె లంగాణను మళ్లీ వెనుకబడేసే కుట్ర జరుగుతోంది.సమైక్యవాదుల బాట లో నడుస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు. ప్రజ ల పక్షాన కేసీఆర్ మళ్ళీ పోరాటం చేస్తారు, కచ్చితంగా మళ్ళీ ముఖ్య మంత్రి అవుతారు. ఈ రాష్ట్రం ఉ న్నంతకాలం కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉం టుంది.

