Praja Deveena
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 10:54 am Posted by : praja deveena

Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్య, సచివాలయంలోనే ఒక పె ద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోం ది 

Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో ఇప్పుడు థియేటర్ల కంటే స చివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రం లో అసలు ప్రభుత్వం ఉందా ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉంది అనే అను మానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంద న్నారు.

సినిమా రంగం గురించి ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసి న వ్యాఖ్యలపై హరీష్ రావు తనదై న శైలిలో స్పందిస్తూ చేసిన కామెం ట్స్ ఆయన మాటల్లోనే..ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బ యటికి వస్తుంది. మరోవైపు ఆశాఖ కు బాధ్యత వహించాల్సిన సిని మాటోగ్రఫీ మంత్రి గారేమో నాకు తె లియదు, నా ప్రమేయం లేదు, నా దగ్గరికి ఫైల్ రాలేదు, నాకు తెలువ దు అని నిస్సహాయంగా చేతులెత్తే స్తారు.శాఖ ఒకరిది.పెత్తనం మరొక రిది జీవో ఇచ్చేది ఇంకొకరు. సాక్షా త్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలి యకుండానేఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే అ స లు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు.

ముఖ్యమంత్రి అసలు మీరు న డు పుతున్నది సర్కారా, లేక సర్కస్ కంపెనీనా. టికెట్ల పెంపు విష యం లో హైకోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయం. ఒక వైపు అసెంబ్లీ సా క్షిగా సొంత డబ్బా మరొక వైపు క్షేత్ర స్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు. చె ప్పేదొకటి, చేసేది మరొకటి పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటి. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేది క గా ఏమని ప్రగల్భాలు పలికారు?

నేను ఈ సీట్లో ఉన్నంత కాలం సి నిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని మైకు పట్టుకొని ఊదరగొట్టినవ్.

మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్ ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెం చుతూ జీవోలు ఇచ్చారు.ఇవాళో రేపో మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అసెం బ్లీలో అబద్ధాలు ఆడటం మీకు వె న్నతో పెట్టిన విద్య అని మాకు తె లుసు.. కానీ సినిమా టికెట్ల విష యంలో కూడా ఇంత నిస్సిగ్గుగా స భను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తా రా.

ఇక సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి చూస్తే జా లేస్తోంది. ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంది,విసినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు.ఐటీ మం త్రిని నేనే సివిల్ ఏవియేషన్ మంత్రి ని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉ న్న శాఖ తో తనకు సంబంధం లేద ని ఎందుకు అంటున్నారు.టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కో మటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారు.

అంటే తెలంగాణలో సినిమా శాఖ కు మంత్రి ఉన్నట్టా లేనట్టా సంబంధి త శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవు తున్నాయం టే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు. తెర వెనుక ఏ రాజ్యాంగే త ర శక్తి ఉంది. ఒక సినిమా రిలీజ్ స మయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు, ఇప్పుడేమో య థేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. మం త్రికి తెలియకుండా పాలన సాగడ మేనా మీ ప్రజా పాలన అంటే.

అసలు సినిమా రంగాన్ని ఒక పరి శ్ర మగా చూస్తున్నారా? లేక మీ రా జ కీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మా ర్చుకున్నారా?ఒక సినిమాకేమో అ ర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు.. ఇం కో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారు.వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు. మీ పేరు మర్చిపో యి నందుకు ఇంకో హీరోని జైలుకు పం పిస్తారు.

ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయి తే రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇ స్తారా. వారానికి వారం రోజులు రే ట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వే స్తారా.రేవంత్ రెడ్డి పాలకుడు అనే వాడు పాలసీ తో ఉండాలి తప్ప, ప గతో ఉండకూడదు.గత పదేళ్లు కేసీ ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఎక్కడా వివక్ష చూ పలేదు. అందుకే ఇవాళ తెలుగు సి నిమా ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ప్రపంచం గర్వించేలా మన సినిమా లు తయారవుతున్నాయి.

50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్ట ప డి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వా తావరణాన్ని మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీ కా రాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు. ప్రభుత్వ మం టే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి చుట్టం, మరొకరికి శత్రుత్వం ఉండకూడదు.సినిమా వాళ్లను కూ డా మీ రాజకీయాలకు వాడుకోవ డం సిగ్గుచేటు.ఇది ప్రజా పాలన కా దు.. ఇది మీ పాపిష్టి పాలన కు ప రాకాష్ట.

మొన్న ఎన్నికల్లో ఓడిపోయి నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపిం చని శక్తి ఎవరో. ఒక్కో సినిమాకు క మిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వ సూలు చేస్తున్నారో, ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం.ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతు న్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దం దాపై గవర్నర్ దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తు న్నామని పేర్కొన్నారు.