Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ ఆసక్తికర వ్యా ఖ్యలు, ఉద్యమం కాలం నుంచి నే టి వరకు నాప్రస్థానం తెరిచిన పుస్త కం
Ex Minister Harish Rao : ప్రజాదీవెన,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ క ల్వకుంట్ల కవిత వివాదాస్పద వ్యా ఖ్యలపై మాజీమంత్రి, సిద్దిపేట ఎ మ్మె mల్యే తన్నీరు హరీష్ రావు త న దైన శైలిలో పరోక్షంగా స్పందించా రు. ఉద్యమం నుంచి 25 ఏండ్లుగా తన ప్రస్థానం తెరిచిన పుస్తకమని వ్యాఖ్యానించారు. లండన్ పర్యట న ముగించుకుని హైదరాబాద్ చే రుకున్న ఆయన శనివారం శంషా బాద్ ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు మీడి యాతో చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.
నా రాజకీయ జీవితం యావత్తు తె రిచిన పుస్తకం. రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు.ఇటీవల కాలంలో నాపై, పార్టీపై కొందరు దు ష్ప్రచారం చేస్తున్నా రు. ఎందుకు చేశారో ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు చేశారో వారికే తెలియాలి. ఎవరో అ బద్ధాలు మాట్లాడినంత మాత్రాన అ వి నిజాలు అయిపోవు. నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలే స్తున్న. కేసీఆర్ గత పదేండ్లుగా ని ర్మించిన ఒక్కో వ్యవస్థను సీఎం రే వంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నరు. రా ష్ట్రంలో ఓ వైపు రైతులు యూరి యా కొరతతో ఇబ్బంది పడుతుంటే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మంచివి కావు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెర వేర్చడమే మా ముందున్న కర్తవ్యం. ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రా ష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంత ఉంటుంది. మేం రాష్ట్ర సాధనకు పోరాటం చేసిన వాళ్లం. రాష్ట్రాన్ని కాపాడుకోవ డం లో బాధ్యత కలిగిన వాళ్లం. అం దు వల్ల మా సమయాన్ని దాని పైనే వె చ్చిస్తం. కేసీఆర్ నాయకత్వంలో తి రిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ప్రజలు పడుతున్న కష్టా లను తొలగించడానికి అందరం కలి సికట్టుగా ముందుకు సాగుతమని మరో మారు స్పష్టంచేశారు.
*ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి హరీష్‌రావు…* ఇదిలా ఉండగా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి మాజీమంత్రి హరీష్‌రావు వెళ్లనున్నట్లు సమాచారం లండన్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన వెంటనే తనపై కవిత చేసి న ఆరోపణలకు హరీష్‌రావు సుతి మెత్తగా కౌంటర్ ఇచ్చారు. అయితే కేసీఆర్, కేటీఆర్‌లతో సమావేశ మ య్యేoదుకే హరీష్‌రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. ప్ర ధానంగా కాళేశ్వరంపై సీబీఐ విచా రణ, కవిత ఎపిసోడ్‌పై చర్చించే అ వకాశాలు మెండుగా ఉన్నాయన్న కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా గడిచిన ఆరు రో జులుగా కేటీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ లోనే మకాం వేశారని ఆయా వర్గా లు తెలియజేస్తున్నాయి.