Politicsతెలంగాణహైదరాబాద్

Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీశ్ ఘాటు వ్యా ఖ్య, అడుగడుగునా వెన్నుపోట్లు, అబద్ధాలు సీఎం రేవంత్ రెడ్డి నైజం 

Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: అడుగ డుగునా వెన్నుపోట్లు, అనుక్షణం అ బద్ధాలు ఇవే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహజ నైజాలని, ముమ్మాటికీ రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర అంటూ మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే త న్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉందని,

సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వ రాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమ కారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అంటూ దుయ్యబడుతూ ఘాటు వ్యాఖ్య లు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనలో చేసిన అనుచిత వ్యా ఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మాజీ మంత్రి, బీ ఆర్ఎస్ శాసనసభా పక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పత్రికా ప్రక టన విడుదల చేశారు. ఈ సంద ర్భంగా జారీ అయిన ప్రకటనలోని సారాంశం ఆయన మాటల్లోనే..

చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ‘ఓ టుకు నోటు’ దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్.ఎన్టీఆర్ జన్మపర్యం తం ద్వేషించిన కాంగ్రెస్ లో చేరి, న మ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపో టు పొడిచిన టీడీపీ ద్రోహి నువ్వు.

సీఎం పదవి అనుభవిస్తూనే, కేం ద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి రేవంత్. కంచె చేను మేసినట్టు తానే ముఖ్యమంత్రి అయి వుండీ, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా బనకచర్ల లాంటి ప్రాజెక్టులకు కోసం పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకు పని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ద్రోహి రే వంత్.

అవినీతి దాహం, ప్రజా ద్రోహం వెర సి రేవంత్ రెడ్డి అని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ సర్కార్‌ ను వ్య తిరేకిస్తూ ఉంటే రేవంత్ మాత్రం బీ జేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తు న్న టీడీపీపై బహిరంగంగా అభిమా నం కురిపించడం వెనుక మతలబు ఏంటి.

కాంగ్రెస్ శత్రువులైన బీజేపీ,టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహారశైలి ఉంది. పగలు రాహు ల్ గాంధీ జపం, రాత్రి బీజేపీ, టీడీపీ దోస్తీ.రేవంత్ రాజకీయ యాత్ర మొ త్తం గురువు చంద్రబాబు కనుసన్న లలోనే సాగుతున్నది. సోనియా గాంధీ ఇచ్చిన సీఎం పదవిని అను భవిస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాలకు తూ ట్లు పొడుస్తూ కమలం చెంతన, క మలానికి కాపు కాస్తున్న బాబు చెం తన చేరడం రేవంత్ ద్రోహబుద్ధికి ప రాకాష్ట.

ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ జెండా ది మ్మెలను కూల్చాలని, ఒక ముఖ్య మంత్రి బహిరంగంగా పిలుపునివ్వ డం అంటే అది రాష్ట్రంలో శాంతిభ ద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడ మే. ఇది నేరాన్ని ప్రోత్సహించడం కాదా. శాంతిభద్రతలను కాపాడా ల్సిన పోలీసు బాధ్యత ఎటు పో యింది? సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, శాంతి భద్రత లను కాపాడే హోమ్ శాఖను నిర్వ హిస్తున్న వ్యక్తి ఇంత బహిరంగంగా నేర చర్యలను, విద్వేషాలను రెచ్చ గొడుతుంటే రాష్ట్ర డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారు, చట్టం అందరికీ ఒక్కటేనని నిరూపించే ధైర్యం పోలీ స్ శాఖకు ఉందా.

రాజకీయంగా ఎదుర్కోలేక, భౌతిక దాడులకు, ఆస్తుల ధ్వంసానికి సీ ఎం పిలుపునివ్వడం రేవంత్ దిగ జారుడుతనానికి నిదర్శనం. ఇలాం టి చర్యలతో తెలంగాణలో అరాచ కాన్ని సృష్టించాలని చూస్తే ప్రజలే త గిన బుద్ధి చెబుతారు. బీఆర్ఎస్ ది మ్మెలు కూలగొడితే రేవంత్ దిమ్మతి రిగే లా బదులిస్తాం, ప్రజాక్షేత్రంలో ప్రజల చేతనే గుణపాఠం నేర్పుతా ము. తెలంగాణ డీజీపీ, ఈ హింస ను ప్రేరేపించే సీఎం వ్యాఖ్యలపై మీ రు తీసుకునే చర్యలేమిటి, రా ష్ట్రం లో రాజ్యాంగం అమలవుతోందా లే క రేవంత్ రాజ్యాంగం నడుస్తోందా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డా రు.

Related Articles

Back to top button