Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ ఘాటు వ్యా ఖ్య, పూటపూటకోమాట ఘడియ ఘడియకోలెక్క, కృష్ణా జలాలపై సీ ఎoరేవంత్ ఒకమాట, మంత్రి ఉత్త మ్ మరోమాట
Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్:కృష్ణా జ లాల్లో వాటా విషయంలో నీటి పా రుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రె డ్డి మళ్లీమళ్లీ పాత పాటే పాడుతు న్నాడని మాజీమంత్రి సిద్దిపేట ఎ మ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమె త్తారు. ఉందాత నంగా వ్యవహరించాల్సిన నీటిపా రుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలే పలి కిండని దుయ్యబట్టారు. బేసిన్ల గురించి బేసిక్స్ తెల్వదు, నీళ్ల వాటా గురిం చి నీళ్లు నములుతారని, కనీ స అవగాహన లేని, తెలంగాణ సో యి లేని ఇట్లాంటి దద్దమ్మలు మన కు ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి కావ డం మన దౌర్భాగ్యమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
ఉత్తంకుమార్ రెడ్డి నిన్న ఏం మాట్లాడిండు,కృష్ణా జలాల్లో 763 టీ ఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చే సి నం అని గొప్పగ చెప్పిండు.రైట్ షేర్ కోసం నేనే స్వయంగా ట్రిబ్యునల్ ముందు అటెండ్ అయినట్లు చెప్పు కున్నడు. మరి ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి( cm Revanth Reddy) ఈ ఏడాది జూన్ 18వ తేదీ న ఏమన్నడు కృష్ణా బేసిన్ మీద 5 00 టిఎంసీలకు బ్లాం కెట్ ఎన్ ఓ సీ ఇవ్వండి, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులై న కట్టుకోండి అని చంద్రబాబుకు ఆ ఫర్ ఇచ్చిండు. మొ న్న సెప్టెంబర్ 13 న జరిగిన నీ టి పారుదల శాఖ సమీ క్షలో ఇదే ముఖ్యమంత్రి ఏమంటడు, కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలె అంటడు.
ఉత్తం ఏమో 763 టిఎంసీల రైట్ షేర్ అంటడు, ముఖ్యమంత్రి ఏ మో ఓ సారి 500 టీఎంసీ అంటడు. ఓసారి 904 టీఎంసీలు అంట డు.పూటకో మాట మాట్లాడి పరువు తీసుకుంటున్నరు.వీళ్ల అజ్ఞా నం వల్ల తెలంగాణ రా ష్ట్రం హక్కుగా రావాల్సిన నీటి వా టా ను కోల్పోయే పరిస్థితి ఉంది.ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా లేదా నీళ్ల మంత్రి చెప్పింది కరెక్టా అసలు ఎవరిది కరెక్టు కనీస అవగాహన లే కుండా ఎట్ల మాట్లాడుతున్నరు. క నీసం ప్రిపరేషన్ లేకుండా ఇలా ఎ న్నాళ్లు ఉంటారు.కేసీఆర్ కృష్ణా జ లాల్లో రైట్ ఫుల్ షేర్ సాధిం చేందు కు సెక్షన్ 3 కోసం పోరాటం చేసారు.
ఉమా భారతి, గడ్కరీ, షకావత్, ప్ర ధానిలను కలిసారు.సుప్రీం కో ర్టు గడప తొక్కి, నిర్విరామ పోరాటం చే సి సెక్షన్ 3 సాధించారు. 763 టీఎం సీలు అనేది కేసీఆర్ పట్టుబట్టిన విషయం.ఇప్పుడు తామేదో కొత్తగా 763 టీ ఎంసీలు డిమాండ్ చేసినట్లు డబ్బా కొడు తున్నడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ( mimister uttam kumar Reddy ) వీళ్లు ఏం అంటున్నరు ఓ సారి 500, ఓసారి 763, ఓ సా రి 904 టీఎంసీలు మా వాటా అంటున్నరు. పూటకో మాట ఘ డి యకో లెక్క.ఒక బాధ్యత లేదు, రా ష్ట్రం మీద ప్రేమ లేదు. నీటి ప్రయోజనాల మీద పట్టి లేదు. 299:5 12 ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సిగ్గులేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు.
ఉత్తం ఏమంటారు 512:299 నీటి వాటాను బిఆర్ఎస్ (Brs) ప్ర భుత్వం పదే ళ్ల పాటు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిందట. చారిత్ర క అన్యా యాన్ని సరి చేస్తున్నరట.ఛీ నోరు తెరిస్తే ప చ్చి అబద్దాలు. ముఖ్య మంత్రి అంతే, నీళ్ల మంత్రి కూడా అంతే. 299: 512 హ క్కుల విషయంలో మేం సం తకం పెట్టినం అని నిరూపిస్తే నేను పద వికి రాజీనామాచేస్తా, లేదంటే నువ్వు చేస్తవా ఉత్తమ్. కృష్ణాలో 29 9:512 వాటా ఇచ్చి, తెలంగాణ తీరని చారిత్రక ద్రోహం చేసింది కాం గ్రెస్ పార్టీ. 2013 అక్టోబర్ 18వ తేదీననాటి ఉమ్మడి ఏపీ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి రిపోర్టు ఇచ్చింది. ఇదే రిపోర్టును శాసనసభలోనూ పెట్టా రు. తెలంగాణకు కృష్ణాలో 299, ఏ పీకి 512 ఇచ్చినం అని అందు లో క్లి యర్ గా ఉంటుంది.
తెలంగాణ ప్రాంత హక్కులకు ఉ మ్మడి రాష్ట్రంలోనే మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. మీ చేతగాని తనం, అడుగులకు మడుగు లొత్తడం వల్ల 299 వాటా పరిమితం అయ్యింది. అడ్ హక్ కు, ఫైన ల్ అ వార్డుకు తేడా తెలియని అజ్నా ను లు రేవంత్ రెడ్డి, ఉత్తం లు. 2015 జూన్ 26లో చేసుకున్న అగ్రిమెంట్ తాత్కాలిక ఒప్పం దం అని లేఖలో స్పష్టంగా ఉంది. ఇప్పుడున్న మీ అడ్వైజర్ ఆది త్యానాథ్ కూడా అం దులో సంతకం పెట్టిండు. కానీ ఉత్తం ఏమంట డు, బిఆర్ఎస్ పెట్టింది అంటడు.జులై 14, 2014 నాడు కృ ష్ణాలో 299 అన్యాయం అని కేంద్రానికి లేఖ రాసినం.
రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే.. ఆ నాటి కాంగ్రెస్ మాకు అన్యాయం చే సింది, కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ ప రివాహక ప్రాంతం ఆధారంగా కేం ద్రాన్ని కోరినం. తెలంగాణ పట్ల మా చిత్తశుద్దికి, నిజాయితీకి ని దర్శనం ఇది.299ని మేం ఒప్పుకోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ రాసిన మరణ శాస నం.ట్రిబ్యునల్ వేయడంలో ఆలస్యం అవుతుందని మొదటి అపెక్స్ కౌన్సిల్ 2016లో చెప్పినం.రెండో అ పెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో అడిగితే షకావత్ గారు సుప్రీం కోర్టులో కేసు వాపస్ తీసుకోవాలని చెప్పిండు.
అప్పుడు కేసు విత్ డ్రా చేసుకొని, సెక్షన్ 3ని సాధించింది బిఆర్ఎ స్.మేం 299 శాశ్వత ఒప్పందం చేసు కుంటే, సెక్షన్ 3 ఎందుకు అడిగాం, అపెక్స్ కౌన్సిల్ ఎందుకు పోయాం, ఎందుకు సుప్రీంకు మెట్లు ఎక్కాం?సెక్షన్ 3పై తెలంగాణ వాదనలు ముగింపు దశలో ఉన్నాయి.ఇలాంటి సమయంలో అవగాహన లేకుండా, పిచ్చి పిచ్చి గా మాట్లాడితే తీర్పును ప్రభావితం చేయవా? 20 25 ఫిబ్రవరి లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ లో ఏముంది. అదే తా త్కాలిక ఒప్పందం వీళ్లు కూ డా చేసుకున్నరు. దీని గురించి ఏ మంటరు ఉత్తమ్. అందులో ఏ ముంది ఫైనల్ అవార్డు వచ్చే దాక 50:50 చేసుకుందామని మీ సెక్రెట రీ రాసిండు.అదే డిమాండ్ చేస్తూ బి ఆర్ఎస్ 28 లెటర్లు రాసి అడిగింది.299 మేము ఒప్పు కోము అని ఎం త ప్రయత్నం చేసినం. పోరాడి నం.ఇన్ని చెప్పాక కూడా 299 కు బిఆ ర్ఎస్ ఒప్పుకున్నది అని దుష్ర్ప చా రం చేసే వాళ్లను ఏమనాలో వాళ్లే చెప్పాలె.
*సమక్క సాగర్ పై డబ్బా ప్రచారం.* సమ్మక్క సారక్క బ్యారేజ్ కు మంత్రి ఉత్తమ్ అనుమతులు సా ధించినట్టు చెప్పుకుంటున్నడు. కొండను తవ్వి ఎలుకను పట్టిండు ఉత్తం కుమార్ రెడ్డి.ఛత్తీస్ ఘడ్ తో కేవలం యాభై ఎకరాల ముంపున కు సంబంధించి సూత్రప్రాయ అంగీ కారం కుదిరితే ఏవో గొప్పలు సాధించినట్టు ప్రచారం చేసు కుంటున్నారు. కాంగ్రెస్ చేసిన తప్పులను సరిదిద్ది, దేవాదులను ప టిష్టం చే సేందుకు ఏడు టీఎంసీ ల సామ ర్థ్యంతో సమ్మక్క సారక్క బ్యారేజ్ ను కేసీఆర్ నిర్మించిండు.83 మీట ర్లకు డీపీఆర్ పంపినం. అన్ని డైరె క్టరేట్ల నుంచి అన్ని రకాల అనుమతులు సాధించినం. బ్యారేజీ కట్టి నం. నీటిని కూడా లిఫ్టు చేసు కుంటున్నం.
కాంగ్రెస్ వచ్చాక ఓ అండ్ ఎండ బ్బు లు ఇవ్వక దేవాదులకు నీళ్లు లిఫ్టు చేయకపోతే, బిఆర్ఎస్ నిలదీసింది కూడా.సమ్మక్క బ్యారేజ్ కు ఛత్తీస్ ఘడ్ నుంచి ఒక్క ఎన్ వోసీ మి నహా అన్ని అనుమతు లు బిఆర్ ఎస్ హయాంలోనే వచ్చాయి.ప్రాజెక్టులకు అనుమతులు ఆప డం లో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ సమ్మక్క సాగర్ విషయం లోనూ అదే చేసిం ది. 2023 ఎన్నికల వేళ ఛత్తిస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.ఇక్కడి కాంగ్రెస్ నాయకులు అక్కడి కాంగ్రెస్ ప్రభు త్వం పై ఒత్తిడి తెచ్చి ఎన్ వో సీ రాకుండా చేసారు. ఇప్పుడు అక్క డున్న బిజేపీ ప్రభు త్వంతో దోస్తీ కట్టి, 50 ఎకరాలకు సూత్రప్రాయ అంగీకారం తెచ్చి, మొ త్తం ప్రాజెక్టునే కట్టినట్లు బిల్డప్ ఇస్తు న్న రు.50 ఎకరాల పై ఒప్పందం చే సుకుంటేనే కాంగ్రెస్ ఇంత ప్రచారం చేసుకుంటే ఎన్నో ప్రాజెక్టులు ఎంతో కస్ట పడి సాధించిన కేసీఆర్ ఎంత ప్రచారం చేసుకోవాలి. సమ్మక సా గర్ విషయంలో కాంగ్రెస్ చేసిందేం లేదు. అంతా డంబాచారం, డబ్బా ప్రచారం.
*ఆల్మట్టి హైట్ పెంపు పై ఎందుకు మౌనం*..తెలంగాణ కాంగ్రెస్, కర్ణా టక కాంగ్రెస్ కలిసి చేస్తున్న ద్రోహం ఇది.కర్ణాటక కాంగ్రెస్ ప్ర భు త్వం ఆ ల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శా సనం రా స్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి, బిహార్ కు వెళ్లి రాజకీయాలు చేస్తున్నడు.ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడు గులకు పెంచాలని కర్ణాటక మంత్రి మండలి నిర్ణ యం తీసుకుంటే ఏం చేస్తున్నారు.కేవలం 100 టిఎంసీల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడం లే దు. కృష్ణా జలాల్లోని తెలంగాణ హ క్కు ను బొందపెట్టి ఉమ్మడి మహ బూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డిల ను ఎడారులుగా మార్చేందుకు క ర్నాటక కాంగ్రెస్ పన్నుతున్న కుట్ర ఇ ది.
అక్కడా కాంగ్రెస్సే, ఇక్కడా కాంగ్రెస్సే అయినా మాట్లాడే దమ్ము, తె లంగాణ రైతుల పొట్టగొడుతుంటే ఆపే ధై ర్యం లేవా? జాతీయ పా ర్టీకి జా తీ య విధానమే లేదు.కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రా ష్ట్రాన్ని, ఇక్కడి రైతులను బలిస్తా రా?బనకచర్ల రూ పంలో కృష్ణా నీళ్ల ను ఏపీ కొల్లగొడితే మౌనం. ఇప్పు డు కర్ణాటక కో ల్లగొడుతుంటే మౌ నం. తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ నీళ్ల దోపిడిని అడ్డుకోకపోతే నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోక తప్పదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.