Ganna Chandrasekhar : ప్రజా దీవేన, కోదాడ; పేద ప్రజల పక్షాన మాట్లాడేది , పోరాటం చేసేది కమ్యూనిస్టులు మాత్రమేనని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు శనివారం చిలుకూరు మండల కేంద్రంలోని పాత చిలుకూరు గ్రామంలోని కస్తూరి అప్పారావు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సిపిఐ చిలుకూరు గ్రామ శాఖల మహాసభలను నిర్వహించారుఈ మహాసభల సందర్భంగా పార్టీ జెండాను స్వాతంత్ర్య సమరయోధులు సిపిఐ సీనియర్ నాయకులు దొడ్డ నారాయణరావు ఆవిష్కరించారు అనంతరం జరిగిన మహాసభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలోని పాలకవర్గాలు కార్పొరేట్ వర్గాలకు కొమ్ముకాస్తూ పేద ప్రజల పొట్ట కొడుతున్నాయని ఆరోపించారు .
పేద వర్గాలకు సంబంధించిన నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ బడా కార్పొరేట్ వర్గాల సంబంధించిన వ్యక్తుల లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నారని విమర్శించారు పాలకవర్గాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కింది స్థాయిలోని పేదలకు అందుతున్నాయా లేదా అని కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఏప్రిల్ నెల మే నెలలో జరగనున్న మండల జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడానికి పార్టీ నాయకత్వం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో తెలంగాణ సాయుధ పోరాట సమయంలో అష్టాంగ మహాసభ జరుపుకున్న ఈ చిలుకూరు గడ్డమీద ఎర్ర జెండా నిత్యం ఆడాలని వారు ఆకాంక్షించారు. అనంతరం కొత్త చిలుకూరు మరియు పాత చిలుకూరు కు సంబంధించిన నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కొత్త చిలుకూరు మరియు పాత చిలుకూరు గ్రామ కార్యదర్శులుగా
షేక్ సాహెబ్ అలీ చిలువేరు ఆంజనేయులు మరియు 35 మందిని కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభ సిపిఐ నాయకులు కట్టెకోల నాగేశ్వర్ రావు బాలెబోయిన రాంబాబు ల అధ్యక్షతన జరిగినది.
ఈ మహాసభలో గీత పనివారాల సంఘం జిల్లా కార్యదర్శి
కొండ కోటయ్య
రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొడ్డ వెంకటయ్య ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు ముక్కా లక్ష్మీనారాయణ కోడారు శ్రీనివాసరావు మండవ అచ్చయ్య సుల్తాని వెంకటేశ్వర్లు బాల బోయిన రవి మల్లెపంగు ఉపేందర్ పూలవాసు సిరాపురపు శ్రీను మాదారపు లక్ష్మయ్య
మాచర్ల వెంకటి కడారు మధు మండవ వెంకటి మాదాసు మేరీ కస్తూరి సైదులు పుట్టపాక అంజయ్య షేక్ హుస్సేన్ పోలె బోయిన గంగాధర్ వడ్డేపల్లి కోటేష్ కస్తూరి సత్యం పిల్లుట్ల కనకయ్య జిల్లా శ్రీను మల్లెపంగు ఉపేందర్ మాదాసు ప్రశాంత్ మాదారపు కొండలు అనంతల రాము తదితరులు పాల్గొన్నారు