Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gas cylinder exploded: గ్యాస్ సిలిండర్ పేలుడులో ముగ్గురు మృత్యువాత

–మృతుల‌లో త‌ల్లి ఇద్ద‌రు పిల్ల‌లు
–ఏపీ రాష్ట్రం అన్న‌మయ్య జిల్లాలో ఘ‌ట‌న
–ప్ర‌మాద ప్రాంతాన్ని సంద‌ర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Gas cylinder exploded: ప్రజా దీవెన, అన్నమయ్య : అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కొత్తపేటలో గ్యాస్‌ సిలిండర్‌ పేలిన దుర్ఘటనలో (Gas cylinder exploded) ముగ్గురు మృత్యువా త పడ్డారు.మృతుల్లో తల్లి సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందడం విచారకరం. పట్టణంలోని తొగట వీధిలో జరిగిన ఈ ఘటనలో లక్కి రెడ్డిపల్లె (Lucky Reddypalle) మండలం ఎర్రగుడికి చెంది న రమాదేవి(34), తన ఇద్దరు పిల్ల లు మనోహర్‌(8), మన్విత(5) సజీ వ దహనమయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.రమాదేవి భర్త రాజా జీవనోపాధి (Livelihood) కోసం కువైట్ కు వెళ్లి అక్కడే పనిచేస్తున్నాడు. ర మాదేవి స్థానికంగా టైలరింగ్ పని చే స్తూ పిల్లల్ని చూసుకుంటోందని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక అధికా రులు ఘటనా ప్రాంతానికి చేరుకునే సరికే జరగాల్సిన నష్టమంతా జరిగి పోయింది. అప్పటికే ముగ్గురూ మరణించడంతో పోస్టుమార్టంకు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘట నపై కేసు నమోదు చేసి ప్రమాద వశాత్తు జరిగిందా, లేక ఎవరైనా కావాలని చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు. రాయ చోటి డీఎస్పీ రామచంద్రయ్య (DSP Ramachandraiah) ఘట నాస్థలిని పరిశీలించారు.

ప్ర‌మాద ప్రాంతాన్ని సంద‌ర్శిం చిన మంత్రి… ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి (Mandipalli Ram Prasad Reddy) పరిశీలించారు. మృతదే హాలకు నివాళులు అర్పించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. అనంతరం ఆయన మాట్లా డుతూ ప్రమాదంలో ముగ్గురు కు టుంబ సభ్యులు మరణించడం బా ధాకరమన్నారు. అలాగే ఎవరికైనా ఎలాంటి సమస్యలున్నా వాటి పరి ష్కార మార్గాలను చూడాలని, తొం దరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఈ ఘటనపై న్యాయ విచారణ చేయాలని, దీనికి వేరెవ రైనా బాధ్యులైతే వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశిం చారు.