ప్రజా దీవెన జైపూర్: జైపూర్‌లో విషాదం చోటుచేసుకుంది.. అజ్మీర్ రోడ్డులోని పెట్రోల్ పంప్ దగ్గర LPG, CNG ట్రక్కులు ఢీకొన్నా యి.. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 24 మందికి గాయాలయ్యాయి. 40 వాహనా లకు మంటలు అంటుకుని దగ్దమై నట్లు పోలీసులు తెలిపారు.. సమా చారం అందుకన్న పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. రద్దీగా ఉండే అజ్మీర్ రోడ్డులో ఎల్‌పీజీ(LPG), సీఎన్‌జీ (CNG) ట్యాంకర్లు ఢీకొన్నాయి.. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి.. మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.. చాలా మందికి గాయాలయ్యాయి.. పదుల సంఖ్యలో వాహనాలు దగ్దమయ్యాయి.. శుక్రవారం (డిసెంబరు 20) ఉదయం రాజస్థాన్‌లోని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్ పెట్రోల్ పంపు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది సమాచారం అందుకన్న పోలీ సులు, ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్), సిఎన్‌జి (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ట్రక్కులు రెండూ ఢీకొన్నాయని, ఆ తర్వాత భారీ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు మరణిం చారని.. 20 మందికి పైగా గాయ పడ్డారని పోలీసులు తెలిపారు..