Gautam Gambhir: టీమిండియా క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు గౌతమ్ గంభీర్. తాజాగా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పేద ప్రజల పట్ల దాతృతత్వం చాటుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పేద ప్రజలు ఎవరు ఆకలితో ఇబ్బందులు పడకూడదని లక్ష్యంగా పెట్టుకొని కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసేందుకు నాంది పలికాడు. 2014లో ఢిల్లీ (delhi) నగరంలో పటేల్ నగర్లో తన పేరు మీద ఒక ఫౌండేషన్ ను మొదలుపెట్టి చదువు, మానవ హక్కుల, పోషకాహారం లాంటి అంశాలపై ఆ ఫౌండేషన్ ను నడిపారు.
ప్రస్తుతం ఏక్ ఆశా జన్ రసోయీ (Ek Asha Jan Rasoi) అనే పేరుతో మరొక కార్యక్రమాన్ని చేపట్టారు.. ఈ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ కిచెన్ ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు కేవలం ఒక్క రూపాయికే భోజనాన్ని అందచేస్తున్నారు.. ఈ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు అన్నం, కూర, చపాతి (Rice, curry, chapati)లాంటి తదితర ఆహారాన్ని అందజేస్తూ దాతృతత్వాన్ని చాటుకుంటున్నాడు. ఈ క్యాంటీన్ ద్వారా ప్రతి రోజు కూడా దాదాపుగా 1000 మంది వరకు భోజనం చేస్తున్నట్లు సమాచారం.. అలాగే ఈ సేవలను గౌతమ్ గంభీర్ ఢిల్లీలో మరికొన్ని ప్రాంతాలలో కూడా ప్రారంభం చేయబోతున్నట్లు తెలుస్తుంది..
ఇలా కేవలం ఒక్క రూపాయికి ఢిల్లీలో మాత్రమే కాకుండా కర్ణాటకలోని హుబ్లీలో హోటల్ రోటీఘర్ కూడా కేవలం ఒక్క రూపాయికే అన్నం, కూర, పప్పు తో భోజనాన్ని అందించడం జరుగుతుంది. రోటీఘర్ మహావీర్ యూత్ (Mahavir Youth) సంస్థ ఆధ్వర్యంలో రోజువారి కూలీలకు కేవలం ఒక రూపాయి భోజనాన్ని అందిస్తున్నారు. గౌతమ్ గంబీర్ (Gautam Gambhir) చేప్పట్టిన ఈ పనికి ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ అని అంటున్నారు.