— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: చదువే ధ్యే యంగా బాలికలు ధై ర్యంగా ముం దుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు.బాలల ది నోత్సవం సందర్భంగా శుక్రవారం ఆ మె నల్లగొండ ప్రభుత్వ బాలికల జూ నియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హా జరై జవహర్లాల్ నెహ్రూ చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ విద్యార్థి దశలో చదువు ప్రధాన లక్ష్యంగా ఉండాలని స్పష్టమైన ల క్ష్యంతో ముందుకు సాగితేనే బల మైన భవిష్యత్తు నిర్మించుకోవచ్చని, చిన్న వయసులోనే క్రమశిక్షణ, స మయపాలన అలవర్చుకోవాలన్నా రు. రోజుకు నిర్దిష్ట సమయం చదు వుకు కేటాయించాలని,సోషల్ మీ డియా మొబైల్ ఫోన్ ఇంస్టాగ్రామ్ ల వినియోగాన్ని పరిమితం చేయాల ని, పుస్తక పఠనం ద్వారా నైపుణ్యా భివృద్ధి ఉన్నత లక్ష్యాలు నిర్ణయించి వాటిని సాధించే దిశగా ప్రతిరోజు కృషి చేయాలన్నారు.
ఆడపిల్లలు మగ పిల్లల కంటే త క్కువ కాదని, భయపడాల్సిన అ వసరం లేదని, ధైర్యంగా ఉండాలని అన్నారు.చదువుకుంటే డాక్టర్లు, క లెక్టర్లుగా,తయారు కావచ్చని, మన సులో ఏది బలంగా అనుకుంటే ఆ విధంగా తయారవ్వవచ్చని అన్నా రు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వై అ శోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి ,కళాశాల ప్రిన్సిపల్ సుధా రాణి సిడబ్ల్యుసి చైర్మన్ చింత కృ ష్ణ ,చైల్డ్ వెల్ఫేర్ సంస్థ నాగ సేన రె డ్డి ,డి సి పి ఓ గణేష్,సరిత, క ళా శాల అధ్యాపకులు, విద్యార్థులు పా ల్గొన్నారు.
