Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

GOLD Rate: పెళ్లిళ్లపై బంగారం పరేషాన్

— ఆటుపోటు ధరల ప్రభావంతో ఆందోళన
— ధరలు చూసి సామాన్యుల విలవిల

GOLD Rate: ప్రజా దీవెన, విజయవాడ: అసలే మాఘమాసం కావడంతో తెలుగు రాష్టాల్ల్రో మార్చి 26 దాకా లక్షలా ది పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో పెరిగిన బంగారం రేట్లను చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు లబోది బోమంటున్నారు. క్రమంగా బంగా రం ధరలు పెరుగుతూ హడలెత్తి స్తున్నాయి. పుస్తెలు చేయించడాని కే మూర్చ వచ్చేంతగా ధరలు పెరు గుతున్నాయి. 22 క్యారెట్ల బంగా రం ధర దాదాపు 80వేలకు చేరువ లో ఉంది. వెండి ధర కిలోపై రూ.వె య్యి పెరిగి రూ. లక్షా7వేలుగా నమోదైంది. ఎన్నడూ లేని విధంగా రూ.86 వేలు దాటిన బంగారం ధర లను చూసి అందరూ షాక్‌ కు గుర వుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం లో జనవరి 1న 24 క్యారెట్ల బంగా రం రూ.78వేలు, 22 క్యారెట్ల బంగారం రూ.71,500 పలికింది.

నెల వ్యవధిలోనే బంగారం ధర రూ.8వేలకు పైగా పెరగడం గమనార్హం. అమెరికాలో ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక యూఎస్‌ డాలర్‌ బలపడ్తున్నది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలో తమ పెట్టుబడులను ఉపసంహరిం చుకుంటుండడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఫలితంగా దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడ్తుండడం వల్లే గోల్డ్‌ రేట్లు పెరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. మున్ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటడం ఖాయమని అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్ల సమయంలో బంగారం రేట్లు అనూహ్యంగా పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి జనవరి 30న మాఘమాసం ప్రారంభమైంది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 26 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది పెళ్లిళ్లు, గృహప్రవేశాలు జరగనున్నాయి. తెలుగిండ్లలో బంగారం లేకుండా పెళ్లిళ్లు జరగవంటే అతిశయోక్తి కాదు. ఆయా కుటుంబాలు తాహతును బట్టి పెళ్లి కూతుర్లకు, ఆడపడుచులకు తులాల కొద్దీ బంగారు ఆభరణాలు కొనడం ఆనవాయితీ. కానీ పెరిగిన బంగారం ధరలతో వధువుల తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. అలాగే పట్టుచీరలు, ఆహార పదార్థాలతో పాటు అన్ని వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.