**రైతు బాంధవుడు నరేంద్ర మోడీ అని కొనియాడిన గోలి మధుసూదన్ రెడ్డి**
Goli Madhu Sudhan Reddy: ప్రజా దీవెన, నల్గొండ టౌన్: రైతు పండించిన పద్నాలుగు రకాల పంటలకు మద్దతు ధర పెంచినందుకుగాను హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కమిటీ ఆద్వర్యంలో పెద్ద గడియారం సెంటర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలభిషేకాలు చేశారు..ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు,కేరళ ఇంచార్జి గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, బీజేపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు మాట్లాడుతూ..గత దశాబ్ద కాలంగా రైతులనుకేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఆదుకుంటుంది అని ,రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి రైతులను మేలు చేకూర్చుతుంది అని తెలిపారు..
క్రమం తప్పకుండా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు..అన్ని రకాల ఎరువులకు సబ్సిడీ అందించి రైతులకు మేలు చేస్తుంది అని తెలిపారు..
మద్దతు ధర లభించడంతో యువత పెద్ద ఎత్తున వ్యవసాయం చేయడానికి మొగ్గుచూపుతున్నారు అని తెలిపారు..ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు, బీజేపి నాయకులు,మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు…