**కిసాన్ మోర్చా జాతీయ నాయకులు**
Goli Madhu Sudhan Reddy: ప్రజా దీవెన,నల్గొండ టౌన్:రాష్ట్రంలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్న అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు శాపంగా మారిందని ప్రభుత్వంపై విరుచుకుపడిన బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి..బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని ఎద్దేవ చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ విత్తనాలను అరికట్టడంలో విఫలమైందని గోలి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు పరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ
ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఏ ఒక్క హామీని అమలుపరచలేదన్నారు ఏకకాలంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదని రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పిన పదిహేను వేల రూపాయలు ఏమయ్యాయి అని ప్రభుత్వాన్ని నిలదీశారు,
వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మాట మార్చి కేవలం సన్నుడ్లకే 500 ఇస్తామని ఖరీఫ్ సీజన్ ముందు చెప్పిన ప్రభుత్వం నేడు సన్నవడ్ల కూడా 500 రూపాయలు బోనస్ వారి అకౌంట్లో జమ చేయలేక పోయిందని తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శించారు..
ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ అధ్యక్షులు, కిసాన్ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు..