–భక్తి శ్రద్దల మధ్య గుడ్ ఫ్రైడే వేడుకలు
Good Friday celebrated : ప్రజా దీవేన, కోదాడ: ప్రపంచ మానవాళి శ్రేయస్సు కొరకే ఏసుక్రీస్తు సిలువపై మరణం పొందాడని ఏసుక్రీస్తు ప్రార్థన మందిరం పాస్టర్ ఆనందరావు అన్నారు . గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం పట్టణంలోని స్థానిక మాజీ సి ఆర్ పీ ఎఫ్ జవాన్ జయరాజు నివాస గృహంలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఫాస్టర్ మాట్లాడుతూ . ప్రజలంతా ఒకరి పట్ల మరోకరు ప్రేమానురాగాలు కలిసి ఉండాలని ఏసుప్రభువు కాంక్షించినట్లు పేర్కొన్నారు.
తాను సిలువపై మరణం పొంది ప్రజలను పాపముల నుండి విముక్తులను చేశారని కొనియాడారు. తాను ఏ నేరం చేయకున్నా, తనకు అన్యాయంగా సిలువ శిక్ష వేసిన సంతోషంగా భరించిన మానవాళి శ్రేయసు కోరుకున్న క్రీస్తు ప్రభువు అని కొనియాడారు అనంతరం క్రైస్తవులు ఒకరినొకరు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాతంగి గాంధీ, బంక వెంకటరత్నం, చెడపంగు జయరాజు, మాతంగి రమేష్, మాతంగి సురేష్, డాక్టర్ బంక వీరేంద్రనాథ్, మాతంగి భాను ప్రసాద్, చెడపంగు అఖిల్, బంకా కుశాల్ చరిత్, చిన్ను, బంకా కరుణ, మాతంగి విజయ రాణి, మాతంగి స్రవంతి,చెడపంగు బుజ్జమ్మ, డాక్టర్ స్నేహలత తదితరులు పాల్గొన్నారు