District Collector Ila Tripathi : ఏఎంఆర్ పి రైతులకు నల్లగొండ కలె క్టర్ శుభవార్త, వారబంది పద్దతిలో సాగునీరు
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: ఏఎమ్ఆర్ పి కాలువల ద్వారా నిర్దేశించిన షె డ్యూల్ ప్రకారం వారబంది పద్దతి లో సాగునీటిని ఇవ్వడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఇందుకు గాను త గు చర్యలు తీసుకోవాలని ఆమె ఇ రిగేషన్ అధికారులను ఆదేశించా రు.ఏఎంఆర్పి కాలువల ద్వారా సా గునీరు అందించే విషయమై మంగ ళవారం ఆమె తన క్యాంపు కార్యా లయంలో ఇరిగేషన్ శాఖ అధికారు లతో సమీక్ష నిర్వహించారు.
ఏ ఎం ఆర్ పి కాలువలకు సాగునీ రందించే నాలుగు మోటర్లకు గాను ఒక మోటారు రిపేరీలో ఉండటం, మూడవ మోటారు ట్రిప్ కావడం వల్ల పూర్తి స్థాయిలో నీరు రావడం లేదని, ముఖ్యంగా ఉదయ సము ద్రం నుండి 100 క్యూసెక్కుల నీరు తక్కువగా వస్తున్నదని తెలిపారు. అయితే మోటారు మరమ్మతుకు ఒక రోజు సమయం పట్టే అవకాశం ఉన్నందున సాగు నీటి సమస్య ఉ త్పన్నం కాకుండా ఉదయ సముద్రం నుండి 50 క్యూసెక్కుల నీటిని కుష న్ పెంచి విడుదల చేయడం జరు గుతున్నదని, అదనంగా ఒకరోజు ఇలాగే కొనసాగించాలని చెప్పారు.
ప్రస్తుతం ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని అందించడం జరుగు తుందని, ప్రస్తుత పరిస్థితులలో చె రువులకు ఎట్టి పరిస్థితుల్లో నీరు ఇ వ్వలేమని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా నిర్దేశించిన నాలుగు నె లల సమయం వరకు ఎట్టి పరిస్థి తులలో చెరువులను నింపడం జర గదని కలెక్టర్ తెలిపారు. నాలుగు మోటర్లు పూర్తిస్థాయిలో పనిచేసి అ నుకున్న మేర సాగునీరు వచ్చిన స మయంలో చెరువులను నింపడం జరుగుతుందని స్పష్టంచేశారు.
నాలుగో మోటారు మరమ్మతు త ర్వాత బుధవారం నుండి పనిచే స్తుందని, అప్పుడు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించడం జరుగు తుందని తెలిపారు. నాలుగు మోట ర్లు పూర్తిస్థాయిలో పనిచేసిన తర్వా త ముందే నిర్దేశించిన ప్రకారం ఆ యా డిస్ట్రిబ్యూటరీల ద్వారా నిరం తరం సాగు నీటిని ఎలాంటి అవరో ధం లేకుండా ఒక ప్రణాళిక ప్రకారం ఇవ్వా లని కలెక్టర్ సూచించారు.
కాగా ఏ ఎం ఆర్ పి హెచ్ ఎల్ సి,ఎ ల్ ఎల్ సి ల ద్వారా సాగు నీరు అం దించేందుకు షెడ్యూల్ రూపొందిం చడం జరిగిందని, గత నెల 28 నుం డి నవంబర్ 24 వరకు కాలువల ద్వారా సాగునీటిని ఇచ్చేలా షె డ్యూల్ రూపొందించినట్లు ఇరిగేష న్ అధికారులు తెలిపారు. ఎగ్జిక్యూ టివ్ ఇంజనీరు నెహ్రు నాయక్, ప్ర భు కళ్యా ణ్, డిప్యూటీ ఎక్జిక్యూటి వ్ ఇంజనీర్ ఆంజనేయస్వామి త దితరులు ఉన్నారు.