Good news to woman : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ప్రభుత్వం సకల మహిళలకు తీపి కబురు అందించింది. తెలంగా ణలోని అనేక గురుకులాల్లో కాం ట్రాక్టర్లు కుళ్లిన కూరగాయలను స ప్లయ్ చేస్తున్నారనే అపవాదు ఉన్న విషయం తెలిసిందే. పాడైన ఆకు కూరలు, కూరగాయలతో వండిన ఆహారాన్ని తిన్న విద్యార్థులు అనా రోగ్య పాలవుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభు త్వం సరికొత్త నిర్ణయాన్ని తీ సుకుం టోంది. కాంట్రాక్టర్ల విధానానికి స్వస్తి పలికి స్థానికంగా ఉన్న మహిళా సంఘాల ద్వారా కూరగాయలు, ప ప్పులు, ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేయించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలు స్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజనానికి కూడా కూర గాయలు, పండ్లు, పప్పుల సరఫరా బాధ్యతను మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనగా ఉంది. జాతీయ పౌష్టికాహార సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా వి ద్యార్థులకు పౌష్టికాహారం అందిం చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆహార పదార్థాలతో పాటు చిరుధాన్యాల కు ప్రాధాన్యమిస్తారు.సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ వికారాబాద్, ఆ దిలాబాద్ జిల్లాల కలెక్టర్‌గా పనిచే సినప్పుడు స్థానిక అంగన్‌వాడీ కేం ద్రాలకు మహిళా సంఘాల ద్వారా చిరుధాన్యాల ఆహారాన్ని పంపిణీ చేయించారు. ఇదే తరహాలో గురు కులాలు, వసతిగృహాలు, పాఠశాల లకు కూడా అందించేందుకు ప్రయ త్నాలు ప్రారంభిస్తున్నారు. తెలంగా ణలోని పలు ప్రాంతాల్లో పండించే కందులు, వేరుశనగకు సరైన ధర లు రావడం లేదు. కూరగాయల నూ రైతులు తక్కువ ధరకు విక్ర యించాల్సి వస్తోంది. వాటిని మహి ళా సంఘాలు కొనుగోలు చేయడం తో రైతులకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం ఉంటుం దని ఉన్నతాధికారులు భావిస్తున్నా రు.
కాగా, రాష్ట్రంలోని గురుకులా లు, వసతిగృహాలు, పాఠశాలలు, వాటిలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మహిళా సంఘాల ను ఎంపిక చేసి సరుకుల సరఫరా బాధ్యతలను అప్పగించేందుకు వీలుగా సెర్ప్ ప్రణాళిక రూపొంది స్తోంది. ఇదిలా ఉండగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రణా ళిక ప్రకారం మహిళా సంఘాలతో గురుకులాలను రన్ చేయాలని, ఒకేసారి రాష్ట్రం అంతా ప్రారంభిం చాలా, లేకుంటే దశలవారీగా చేప ట్టాలా అనే అంశంపై త్వరలో నిర్ణ యం తీసుకోనున్నారు. ఈ కొత్త కార్యక్రమం రూపకల్పన కోసం త్వ రలో సీఎస్ శాంతికుమారి అధ్యక్ష తన సెర్ప్ సీఈవో, అన్ని గురుకుల విద్యాలయాల సంస్థలు, విద్యాశా ఖ కార్యదర్శులతో సమావేశం జర గనుంది. దీనిపై మార్చి నెలాఖరు లోగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వడానికి సెర్ప్ కృషి చేస్తోంది. ఈ కార్యక్రమం అమలైతే అటు మ హిళలకు, ఇటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పరిశీల కులు భావిస్తున్నారు.