Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Governor Jishnu Dev Verma: పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు ప్ర పంచ గుర్తింపుకు చిహ్నాలు

–ప్రపంచ సుందరీమణుల సందర్శ న తో 30శాతం అమ్మకాలు పెరిగా యి
–ఇక్కత్ చేనేత ఉత్పత్తులు వారస త్వంగా వస్తున్న ఒక కళ
–పోచంపల్లి గ్రామంలో చేనేతలో చాలామంది నిష్ణాతులున్నారు
–అహ్మదాబాద్ ఎన్ఐటి, ఐఐటి స హకారంతో అధ్యయనం చేయాలి
— చేనేత కార్మికులతో ముఖాము ఖిలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

Governor Jishnu Dev Verma: ప్రజా దీవెన, భూదాన్ పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు ఒక కళ మాత్రమే కాదని, గుర్తింపుకు చి హ్నమని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు.చేనేత అనేది ఒక క ళ అని ప్రత్యేకించి పోచంపల్లి ఇక్క త్ చీరలు, ఉత్పత్తులు ప్రపంచ ప్రసి ద్ధిగాంచాయని ,ఇటీవల ప్రపంచ సుందరీ మణుల సందర్శనతో 30 శాతం అమ్మకాలు పెరిగాయని తెలి యడం సంతోషమని అన్నారు.

పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులను ఎలా తయారు చేస్తారో తాను స్వ యంగా చూసి తెలుసుకున్నానని, గతంలో పోచంపల్లి చీరల పై పుస్త కాల్లో మాత్రమే చదివానని, ఇది త నకు మంచి అనుభవం అని అన్నా రు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి గ్రామం లో ఇక్కత్ చేనేత కార్మికులతో మా ట్లాడటమే కాకుండా, పోచంపల్లి టూరిజం టెక్స్టైల్ పార్కులో పో చంపల్లి ఇక్కత్ ఉత్పత్తులను పరి శీలించారు. అంతేకాక చేనేత కార్మి కులతో ముఖాముఖి మాట్లాడారు.

చేనేత కార్మికుల సంక్షేమం, వారి స్థి తిగతులు, సమస్యలను తెలుసు కున్నారు. అనంతరం రాష్ట్ర గవర్న ర్ టెక్స్ టైల్ పార్కు సమావేశ మం దిరంలో నేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ పోచంపల్లి గ్రామంలో చేనేతలో చాలామంది నిష్ణాతులు ఉన్నారని, ఆఫ్ సిల్క్, కాటన్ వం టి అన్ని రకాల ఉత్పత్తులను త యారు చేస్తున్నారని భవిష్యత్తులో పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు మంచి అవకాశాలున్నాయని తెలి పారు. అయితే పోచంపల్లి ఉత్ప త్తులకు మరింత ప్రాచుర్యంతో పాటు,మార్కెటింగ్ తీసుకువచ్చేం దుకు అహ్మదాబాద్ లోని ఎన్ ఐ టి, ఐ ఐ టి సహకారం తో స్థానిక నేత కార్మికులు కలిసి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నా రు.

ప్రత్యేకించి మార్కెటింగ్ , డిజైనిం గ్ ,డయింగ్ అన్ని విషయాల్లో అ ధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పోచంపల్లి చేనే త కార్మికుల తో మాట్లాడిన అనంత రం ఇక్కత్ ఉత్పత్తులకు మార్కెటిం గ్ సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వ చ్చిందని, అంతేకాక నకిలీ ఇక్కత్
సమస్యను కూడా నేత కార్మికులు చెబుతున్నారని, ఈ రెండింటిని గు ర్తించి పరిష్కరించాల్సిన అవస రం ఉందని అన్నారు .ప్రస్తుతం పో చం పల్లి నేత కార్మికులు నేతతో పాటు, ఉత్పత్తి ,కలర్ ,మార్కెటింగ్, డిజై నింగ్ అన్ని వారే చూడడం వల్ల ఇ క్కత్ ఉత్పత్తులను విస్తృతి చేసేం దుకు అవకాశం లేదని తెలిపారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించిన ట్లయితే చేనేత కార్మికులను కాపా డిన వారమవుతామని,ఇక్కత్ చేనే త వారసత్వంగా వస్తున్న ఒక కళ అని అన్నారు.

హ్యాండ్లూమ్స్ కూడా హ్యాండీక్రాఫ్ట్ కోవలోకే వస్తాయని, అలాంటి పో చంపల్లి చేనేత ఉత్పత్తులలో భా గంగా దేశంలోనే అత్యంత ప్రతిష్ఠా త్మకమైన పద్మశ్రీ అవార్డు పొందిన వారు కూడా పోచంపల్లి గ్రామంలో ఉండటం అభినందనీయమని అ న్నారు.నేత కార్మికులకు ఉన్న స మస్యలు చాలా చిన్నవని, వాటిని సులభంగా పరిష్కరించవచ్చని, రా ష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల కు ప్రస్తుతం అమలు చేస్తున్న పథకా లు బాగున్నాయని చెప్పారు. పో చంపల్లి ఇక్కత్ చీరలు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా, దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లవచ్చని, కార్మికులు ఇలాగే పని చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు .

రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మా ట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ స్థాయి లాంటి వ్యక్తులు పోచంపల్లి ఉ త్పత్తులను పరిశీలించేందుకు రా వడం రెండవసారి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పి స్తూ ఆదుకుంటున్నదని, ముఖ్యం గా త్రిఫ్ట్ స్కీమ్, ఇన్సూరెన్స్ స్కీమ్, రుణమాఫీ, నేతన్న భరోసా, వంటి పథకాల ద్వారా సహకారం అంది స్తున్నామని తెలిపారు .

అలాగే నేత కార్మికుల కోసం ప్రత్యే కించి కొండా లక్ష్మణ్ బాపూజీ అవా ర్డును ప్రతి సంవత్సరం ఇస్తున్నా మని, ఇందులో భాగంగా 25 వేల రూపాయల నగదు, శాలువాతో స న్మానిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో చేనేతలు వివిధ రా ప్రాంతాలలో అభివృద్ధి చెంది ఉన్నాయని, పీతాంబరి చీర లు, ఆర్మూర్ చీరలు, సిద్దిపేట గొల్ల భామ చీరలు ప్రసిద్ది అని తెలిపా రు. టెస్కోద్వారా చేనేత మెటీరి యల్ సేకరిస్తున్నామని, ఈ సంవ త్సరం పోచంపల్లి రా మెటీరియల్ ను 6 కోట్ల రూపాయలతో సేకరిస్తు న్నట్లు తెలిపారు.

భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోచంపల్లి గ్రామానికి ప్రపంచ సుం దరి మణులు రావడం వల్ల పోచంప ల్లి ఉత్పత్తుల అమ్మకాల మార్కెటిం గ్ 30 శాతం పెరిగిందని, అంతే కాక ప్రపంచ వ్యాప్తంగా పోచంపల్లికి ప్ర చారం వచ్చిందని, రాష్ట్ర గవర్నర్ రాకతో పోచంపల్లి మరోసారి ప్రాచు ర్యం పొందిందని అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కు యాదాద్రి భువనగిరి జిల్లా కు త్రిఫ్ట్ పథకం కింద 90 కోట్ల రూపాయలు ఇచ్చిందని, అలాగే రుణ మాఫీ కిం ద ఆర్థిక సహాయం ఇవ్వనుందని, నేతన్న భరోసా,నేతన్న బీమా వం టి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు .

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ గవర్నర్ లాంటి వ్యక్తులు నేతన్నల ను ప్రోత్సహించడం సంతోషకర మ ని అన్నారు. ప్రస్తుతం ఉన్న సాంకేతి క పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఐఐటి, ఎన్ఐటి ద్వారా మరింత మె రుగైన విధంగా పోచంపల్లి ఉత్పత్తు లను పెంపొందించుకునేందుకు అవ కాశాలున్నాయని, పోచంపల్లి లో దశాబ్దాల తరబడి చేనేత కార్మికులు ఉత్పత్తులను తయారు చేస్తున్నార ని, ముఖ్యంగా మహిళా కార్మికులు
చేనేత చీరల తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని ,దీని ద్వారా ప్రతి నెల 15 నుండి 20 వేల వరకు వారు సంపాదిస్తున్నారని, అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా చే నేత కార్మికులు అదనపు ఆదాయా ని కై ప్రభుత్వానికి నివేదిస్తున్నారని దీన్ని దృష్టిలో ఉంచుకొని త్వరలోనే మార్కెటింగ్, డిజైనింగ్ వంటివి ఎ లా అభివృద్ధి చేయాలో రాష్ట్ర గ వర్నర్ సూచనల ను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలి పారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజ య్య మాట్లాడుతూ పోచంపల్లి చేనే త ఉత్పత్తులు బాగున్నాయని, అ యితే మార్కెటింగ్ సరిగాలేదని, ఈ సమస్యను పరిష్కరిస్తే నేత కార్మి కులు బాగుపడతారని, వ్యవసాయ రంగానికి సహకరించినట్లు గానే చే నేత రంగానికి కూడా ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు.

మరో పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ మాట్లాడుతూ పోచంపల్లి గ్రామం ఇక్కత్ కు మాత్రమే ప్రసిద్ధి కాదని, ఇది నాలుగు రకాల సబ్జె క్టు లతో ముడిపడి ఉందని నేత, డ యింగ్, కలర్ అన్నిరకాల పరిజ్ఞానం ఉన్న కార్మికులు ఇందులో ఉన్నార ని, అయితే వీరి కోసం అదనంగా ఏం చేయగలమో ఆలోచించాల్సిన అవసరం ఉందని, చేనేత కార్మికు లందరికీ జియో ట్యాగింగ్ ఇవ్వాల ని ,ఇక్కత్ పరిజ్ఞానాన్ని కాపాడాల్సి న అవసరం ఉందని అన్నారు.

అంకం పాండు మాట్లాడుతూ ప్రభు త్వం నేత కార్మికుల కోసం అమలు చేస్తున్నవివిధ పథకాల వల్ల నేత కార్మికులకు ఆత్మస్థైర్యం తో పాటు, జీవన ప్రమాణాలు పెరిగాయని, త్రి ఫ్ట్ పథకం వల్ల తనాకు రెండు లక్షల 15 వేల రూపాయలు వచ్చాయ ని ,పిల్లల చదువుకు వినియోగించా నని,అయితే నేత కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు .

భారత గగన అనే నేత కార్మికు రా లు మాట్లాడుతూ 30 సంవత్సరాల నుండి తాను మగ్గం నేస్తున్నానని, చిన్నప్పుడే తన భర్త చనిపోతే నలు గురు పిల్లల్ని చేనేత పైన ఆధారప డి బ్రతికించు కుంటున్నానని, ప్రభు త్వం త్రిఫ్ట్ పథకాన్ని పెట్టడం బా గుందని అయితే చేనేత కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చే శారు.

గుర్రం హేమలత మాట్లాడుతూ తాను ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిఫ్ట్ పథకంలో చేరి 36 నెలలు రెండు వే ల రూపాయల చొప్పున చెల్లించా మని, రెండు లక్షలు వచ్చాయని, దీని ద్వారా ఇళ్లు నిర్మించుకున్నని, తమకు చాలా సంతోషంగా ఉంద ని, మళ్ళీ తిరిగి పొదుపు చేస్తామని తెలిపారు.

మరో నేత కార్మికురాలు శశికళ మా ట్లాడుతూ చేనేత బీమా పథకం వల్ల చేనేత కార్మికులకు న్యాయం చేకూరుతుందని ,తన భర్తకు పక్ష వాతం వస్తే తినడానికి కూడా తిండి లేకుండేదని,ఇప్పుడు చేనేత వల్ల భరోసా వచ్చిందని, చేనేత కార్మికు లందరికీ జియో ట్యాగింగ్ ఇవ్వాల ని కోరారు.

తడక రమేష్ మాట్లాడుతూ చేనేత కు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయ డం సంతోషమని మార్కెటింగ్ రం గంలో 600 మంది పోచంపల్లి లో ఉన్నారని, వారికి కూడా జియో ట్యాగింగ్ ఇవ్వాలని, వారికి గుర్తిం పు ఇవ్వాలని, నకిలీ ఇక్కత్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నకిలీ ని అరికట్టాలని, పోచంపల్లి లో యార్న్ డిపో ఏర్పాటు చేయాల ని, కల్యాణలక్ష్మి పథకం కింద ప్ర భుత్వం లక్ష పదివేల రూపాయలు ఇస్తున్నదని, దానితోపాటు ,ఒక పో చంపల్లి చీర ,దోతిని ఇస్తే బాగుం టుందని సూచించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఉపేందర్, భాగ్యలక్ష్మి, యాదగిరి అనే నేత కార్మికులకు నేతన్న రుణా ల కింద 5 లక్షల రూపాయల చెక్కు లను పంపిణీ చేశారు. నేతన్న పొ దుపు పథకం కింద యాదాద్రి భువ నగిరి జిల్లా మొత్తానికి రెండు కోట్ల పదిహేను లక్షల 25 వేల రూపా యల చెక్కును నేత కార్మికులకు అందజేశారు. అంతకుముందు పార్కులో ఏర్పాటు చేసిన పో చం పల్లి ఇక్కత్ పట్టు వస్త్రాలను రాష్ట్ర గవర్నర్ పరిశీలించడమే కాకుండా , నేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి స్థి తిగతులను, జీవన విధానాలను , ఇక్కత్ ఉత్పత్తుల తయారీలో వా రుఎదుర్కొంటున్న సమస్యలు అడి గి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పి ఆకాంక్ష యాదవ్ వందన సమర్ప ణ చేయగా, రాష్ట్ర గవర్నర్ ఓ ఎస్ డి భవాని శంకర్ ,ల్మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు , ఇతర అధి కారులు పాల్గొన్నారు.