ఘనంగా చాడ కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలు
ప్రజా దీవెన/ నల్లగొండ: బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి జన్మదిన సందర్భంగా శనివారం నల్లగొండ పట్టణంలోని నాగార్జున కాలనీ లో గల ఆయన నివాసం వద్ద బిఆర్ఎస్ బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిoచారు.విద్యార్థి విభాగం నాయకుడు కంచర్ల శ్రవణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా గజమాలతో సత్కరించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి ఆదేశానుసారం పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ తన వంతు సహాయ సహకారాలు అందించిన మహా నాయకుడు చిరంజీవిగా వర్ధిల్లాలని అలాగే రానున్న శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి వారికి అవకాశం కల్పించాలని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ వేదిక ద్వారా పలువురు కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఊర సత్యనారాయణ రెడ్డి, లతీఫ్, వెంకటాచారి, వెంకటాద్రి, ఉపసర్పంచ్ దాసరి వెంకన్న, మల్లేష్, అంజయ్య, ముస్తఫా, సతీష్ గౌడ్, మండల్ పరమేష్, విద్యార్థి నాయకులు కంచర్ల శ్రవణ్ గౌడ్ , కొండాపురం అరుణ్ ప్రభాకర్ రెడ్డి, పరమేష్ ,నాగుల సన్నీ, పవన్ చింటు, లింగస్వామి లతో పాటు మహిళలు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కనగల్ మండల కేంద్రంలో… కనగల్ మండలంలోని ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని రానున్న రోజుల్లో నల్లగొండ శాసనసభ్యుని అవకాశం రావాలని ఆ దేవదేవతని మనసారా కోరుకున్నారు .ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పోలోజు వెంకటాచారి పోలే వెంకటాద్రి కర్నాటి మల్లేష్ మండలి పరమేష్ యాదవ్ బల్గురి సతీష్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.