District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రుల సందర్భంగా గల్లీగల్లీలో అంగరంగ వైభవంగా గణనాథులు కొలువుదీ రారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జి ల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శర త్ చంద్ర పవార్ లు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేందుకు దేవుని కృప అవస రమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పే ర్కొన్నారు. వినాయక చవితి సంద ర్భంగా ఆమె జిల్లా ప్రజలకు శు భా కాంక్షలు తెలియజేశారు.బుధ వా రం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి నల్గొండ జిల్లా కేం ద్రంలోని రామాలయంలో ఏర్పాటు చేసిన మొదటి గణేష్ విగ్రహానికి ప్ర త్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియా ప్ర తినిధులతో మాట్లాడుతూ జిల్లా ప్రజలు సుభిక్షంగా, కలిసిమెలిసి సంతోషంగా ఉండేలా వినాయకు డు అందరిని ఆశీర్వదించాలని ఆ కాంక్షించారు. ముఖ్యంగా ప్రజలు తలపెట్టిన కార్యాలు ఎలాంటి వి ఘ్నాలు లేకుండా కొనసాగేందుకు ప్రజలంతా సుఖఃసంతోషాలతో ఉం డేందుకు దేవుని కృప అవసరమని, వినాయకుడు తన కృపను, కరుణా కటాక్షాలను ప్రజలకు అందించి దీ వించాలని వేడుకొన్నారు.
జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ జి ల్లా ప్రజాలలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి, గణేష్ ఉత్సవ సమితి సె క్రటరీ యా దగిరి తదితరులు పాల్గొన్నారు.
*జిల్లా పోలీస్ కార్యాలయం లో…* జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వార్ జిల్లా ప్రజలకు, అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభా కాంక్షలు తెలియ జేశారు. వినాయ క చవితి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ ణనాధునికి జిల్లా ఎస్పీ పాల్గొని ప్ర త్యేక పూజలు ఘనంగా నిర్వహిం చారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లా డుతూ జిల్లా ప్రజలకు అధికారుల కు,సిబ్బందికి వినాయక చవితి శు భాకాంక్షలు తెలుపుతూ,జిల్లాలో న వరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణం భక్తి శ్రద్ధలతో కులమ తాలకు అతీతంగా సోదరభావం ని ర్వహించుకోవాలనీ తెలిపారు. మం డపాల వద్ద నిర్వాహకులు, యువ త పోలీస్ వారి సూచనల పాటిస్తూ సహకరించాలని తెలిపారు.
ఈ పూజ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్,నల్లగొండ డీఎస్పీ శివ రాం రెడ్డి, 2 టౌన్ సీఐ రాఘవరావు, ట్రాఫిక్ సీఐ మహా లక్ష్మయ్య, ఆర్. ఐలు సంతోష్, సూరప్ప నాయు డు, శ్రీను, నరసింహ,హరిబాబు, యస్.ఐ సైదా బాబు, ఆర్.యస్. ఐలు కళ్యాణ్ రాజ్,రాజీవ్,అఖిల్, సాయి రామ్,శ్రావణి,మరియు పోలీ స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నా రు.