Great in the joint district Minister’s birthday celebrations ఉమ్మడి జిల్లా లో ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు
--సర్వమత ప్రార్ధనలతో మంత్రి జగదీష్ రెడ్డికి ఆశీర్వచనం --శుభాకాంక్షలు తెలిపిన సీఎం, మంత్రులు కేటీఆర్,హరీష్ రావులు మండలి చైర్మన్ గుత్తా -- వేడుకల్లో పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధులు --మూడు జిల్లాల కలెక్టర్లు,ఎస్ పి లు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభినందనల వెల్లువ
ఉమ్మడి జిల్లా లో ఘనంగా
మంత్రి జన్మదిన వేడుకలు
–సర్వమత ప్రార్ధనలతో మంత్రి జగదీష్ రెడ్డికి
–ఆశీర్వచనంశుభాకాంక్షలు తెలిపిన సీఎం, మంత్రులు కేటీఆర్,హరీష్ రావులు మండలి చైర్మన్ గుత్తా–
–వేడుకల్లో పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధులు–
-మూడు జిల్లాల కలెక్టర్లు,ఎస్ పి లు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభినందనల వెల్లువ
ప్రజా దీవెన/ నల్లగొండ: రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, పార్టీ శ్రేణులు,ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన వేడుకలలో శాసనమండలి సభాపతి గుత్తా సుఖేందర్ రెడ్డి తో సహ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు,జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లు ఇతర కార్పొరేషన్ చైర్మన్ లు తమ తమ కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరుకుని ఆశీర్వాదం తీసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి నేరుగా నల్గొండకు చేరుకున్నారు.మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు చరవాణి ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి నల్లగొండ కు బయలు దేరిన మంత్రి జగదీష్ రెడ్డికి.
మార్గం మధ్యలో వలిగొండ లో బి ఆర్ యస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత నార్కెట్ పల్లి చేరుకున్న మంత్రి జగదీష్ రెడ్డికి స్థానిక శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య, జడ్ పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ కు చేరుకున్న మంత్రి జగదీష్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు. సర్వ మత ప్రార్ధనలతో మంత్రి జగదీష్ రెడ్డిని ఆశీర్వదించగా బి ఆర్ ఎస్ శ్రేణులు, ఉద్యోగ, ఉపాధ్యాయ,కలం కార్మికులు మంత్రి జగదీష్ రెడ్డిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.నల్లగొండ, యాదాద్రి భోనగిరి, సూర్యపేట జిల్లాల కలెక్టర్లు,పోలీస్ అధికారులు వినయ్ కృష్ణారెడ్డి,పమేళా సత్పతి,వెంకట్రావు ,అపూర్వారావు, రాజేష్ కుమార్,రాజేంద్రప్రసాద్ లు వేరు వేరుగా మంత్రి జగదీష్ రెడ్డిని కలసి అభినందనలు తెలిపారు.సూర్యపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి అనుంగు అనుచరులు జిల్లా శంకర్,శోభన్ బాబు లు ఇసుకతో రూపొందించిన మంత్రి జగదీష్ రెడ్డి శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలువుగా సూర్యపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి అభిమాని పల్సా వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో టమాటాలు పంపిణీ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు.రాష్ట్ర విద్యుత్ గుత్తే దారుల సంఘం నేతలు శివకుమార్, మాజిద్,తదితరుల ఆధ్వర్యంలో చౌటుప్పల్ లోని అమ్మా నాన్న ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు. సూర్యపేటలో యువత తో జన్మదిన వేడుకలు హోరెత్తగా బోనాలు, కోలాటలు, జిమ్నాస్టిక్స్ తో పండుగ వాతావరణం ఏర్పడింది.