Guarantees of Anganwadis should be implemented: అంగన్వాడీల హామీలు అమలు చేయాలి
కలెక్టరేట్ ముట్టడిలో అంగన్వాడి ఉద్యోగులు
అంగన్వాడీల హామీలు అమలు చేయాలి
–కలెక్టరేట్ ముట్టడిలో అంగన్వాడి ఉద్యోగులు
ప్రజా దీవెన/ నల్లగొండ: తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (సిఐటియు ఏఐటియూసి)ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు వేలాదిమంది అంగన్వాడి ఉద్యోగులు ముట్టడిoచారు. ప్రధాన గేటుకు తాళాలు వేసి అంగన్వాడీ ఉద్యోగులు నాలుగు గంటలపాటు బైఠాయించడంతో కలెక్టరేట్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి.అంతకుముందు డైట్ కాలేజీ నుండి కలెక్టరేట్ వరకు మహా ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యoలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి కనీస వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత పది రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్న ఆడపడుచుల కోరికలను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పై ఉoదన్నారు. శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కార్మిక సంఘాలతో మొదట చర్చలు జరిపి వాగ్దానం చేసినవి అమలు పరచకుండా మాట మార్చడం సరైనది కాదన్నారు.
పర్మినెంట్ ,కనీస వేతనాలు, గ్రాడ్యుటి ,రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, వారసులకు ఉద్యోగాలు, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా మార్చుతూ అధికారికంగా సర్కులర్ ,జీవోలు ఇచ్చి అంగన్వాడీల సమ్మె విరమింపజేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసురత్న తదితరులు ప్రసంగించారు.
పొడిసెట్టి నాగమణి ,వనం రాధిక ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు ఏఐటియూసి జిల్లా నాయకులు ఎండి సలీం, అవుత సైదయ్య, దోటి వెంకన్న, చాపల శ్రీను, దండంపల్లి సత్తయ్య, మల్లు గౌతమ్ రెడ్డి, చింతపల్లి బయన్న, ఏర్పుల యాదయ్య, డి వెంకన్న, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కే విజయలక్ష్మి, బి పార్వతి, మణెమ్మ, ఏ సుమతమ్మ, ఆర్ శోభ, ఏ రజిత, ప్రమీల ,అరుణ ,సాయి విజిత, అన్నపూర్ణ ,కళమ్మ ,పరిపూర్ణ, స్వరాజ్యం, శాంతి కుమారి, మమత, సుభాషిని, లక్ష్మి, ప్రకృతాంబ, లూర్డు మేరీ ,కళ్యాణి, పద్మ, కేదారి సత్యమ్మ, నాగమణి, విజయ, సైదాబీ , శోభ, సుజాత, జయమ్మ , మనిరూప , రత్నమాల, జ్యోతి, గౌరీ, అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, ధనుంజయ గౌడ్, నాంపల్లి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు